Site icon NTV Telugu

Operation Akhal: కుల్గాంలో ఎన్‌కౌంటర్.. మరో ఉగ్రవాది హతం

Operation Akhal

Operation Akhal

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ సైన్యం ముష్కరుల భరతం పడుతోంది. ఒక్కొక్కరిని ఏరివేస్తోంది. ఇటీవల శ్రీనగర్‌లో ఆపరేషన్ మహాదేవ్ చేపట్టి ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. పహల్గామ్ కీలక సూత్రదారి సులేమాన్ సహా మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. తాజాగా శనివారం ఆపరేషన్ అఖల్ నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.

ఇది కూడా చదవండి: Kalabhavan Navas: మలయాళ నటుడు కళాభవన్ నవాస్ అనుమానాస్పద మృతి!

జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని అఖల్ ప్రాంతంలో భద్రతా దళాలు-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమైనట్లు భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్స్ శనివారం తెలిపింది. ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ చేపట్టినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొంది.

ఇది కూడా చదవండి: Pregnant women : తల్లి అయ్యే ముందు తెలుసుకోవలసిన 5 ముఖ్యమైన విషయాలు !

శుక్రవారం అఖల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు తిష్ట వేసినట్లు సైన్యానికి పక్కా సమాచారం అందింది. దీంతో శనివారం భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో సైన్యంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. సైన్యం కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం కాగా.. మరికొందరి కోసం గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: OG : పాట లీక్.. సుజీత్ కొంప ముంచిన థమన్ !

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు.. 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. అనంతరం భారత ప్రభుత్వం.. మే 7న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఇక జూలై 28న ఆపరేషన్ మహాదేవ్‌లో పహల్గామ్ ఉగ్రవాదులు హతం అయ్యారు.

 

Exit mobile version