NTV Telugu Site icon

Telangana Exit Polls: తెలంగాణలో బీజేపీ సంచలనం.. 12 ఎంపీ సీట్లు గెలుస్తుందని అంచనా..

Bjp

Bjp

Telangana Exit Polls: లోక్‌సభ ఎన్నికలు-2024కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ సంచలన ఫలితాలు నమోదువుతున్నాయి. మరోసారి ప్రధాని నరేంద్రమోడీ అధికారంలోకి రాబోతున్నట్లు గెలుస్తోంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మరోసారి కేంద్రం గద్దెనెక్కబోతోందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మొత్తం 543 లోక్‌సభ సీట్లలో మ్యాజిక్ ఫిగర్ 272 స్థానాలను దాటుతుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెబుతున్నాయి. సగటున చూస్తే బీజేపీ కూటమికి 365 స్థానాలు వస్తాయని, కాంగ్రెస్ నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి సగటున 142 సీట్లకే పరిమతం అవుతుందని అంచనా వేస్తున్నాయి.

Read Also: Somnath Bharti : మూడోసారి మోడీ ప్రధాని అయితే గుండు కొట్టుకుంటా : ఆప్ ఎంపీ అభ్యర్థి సోమనాథ్

ఇదిలా ఉంటే దక్షిణాదిలో బీజేపీకి కర్ణాటకలో గట్టి పట్టుంది. అయితే, ఈ సారి కర్ణాటకకు సపోర్టుగా తెలంగాణ నిలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. తెలంగాణలోని మొత్తం 17 ఎంపీ స్థానాల్లో మెజారిటీ సీట్లు బీజేపీ కైవసం చేసుకోబోతోందని సర్వే సంస్థలు అంచనా వేశాయి. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ఏకంగా బీజేపీ 11-12 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. అదే సమయంలో అధికార కాంగ్రెస్ 4-6 స్థానాలకు పరిమితం అవుతుందని చెప్పింది. ఇతరులు ఒక స్థానంలో గెలుస్తుందని చెప్పింది. మరోవైపు ఇండియా టీవీ కూడా 8-10 సీట్లను బీజేపీ గెలుస్తుందని చెప్పింది.

జన్ కీబాత్ ప్రకారం బీజేపీకి 9-12, బీఆర్ఎస్ 0-1, కాంగ్రెస్ 4-7
ఆరా మస్తాన్: బీజేపీకి 08-09, బీఆర్ఎస్ 00, కాంగ్రెస్ 07-08
చాణక్య టుడే: బీజేపీకి 10-14, బీఆర్ఎస్ 00, కాంగ్రెస్ 03-07
న్యూస్ 18: బీజేపీకి 07-10, బీఆర్ఎస్ 03-05, కాంగ్రెస్ 05-08

Show comments