Site icon NTV Telugu

Tejashwi Yadav: చంద్రబాబు, నితీష్‌కుమార్‌ను బ్లాక్‌మెయిల్ చేసేందుకే బిల్లు.. తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు

Tejashwi Yadav

Tejashwi Yadav

బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును బెదిరించేందుకే కేంద్రం తొలగింపు బిల్లు తీసుకొచ్చిందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం కేంద్ర ప్రభుత్వం తీవ్రమైన నేరారోపణలపై అరెస్టైన ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు 30 రోజుల్లోగా పదవి నుంచి తొలగిపోవాలి.. లేదంటే తొలగింపబడే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. తాజాగా ఈ బిల్లుపై తేజస్వి యాదవ్ స్పందిస్తూ చంద్రబాబు, నితీష్ కుమార్ కోసమే ఈ బిల్లు తీసుకొచ్చారని ఆరోపించారు. బ్లాక్ మెయిల్ చేయడానికి.. బెదిరించడానికి కేంద్రం కుట్ర పన్నిందన్నారు.

ఇది కూడా చదవండి: Kerala: మలయాళ నటికి యువ నాయకుడు లైంగిక వేధింపులు.. సోషల్ మీడియాలో బాధితురాలు ఆవేదన

ప్రస్తుతం మోడీ ప్రభుత్వం టీడీపీ, జేడీయూల మద్దతుతోనే నడుస్తుంది. అయితే భవిష్యత్‌లో వాళ్లిద్దరిని బెదిరించడానికి తొలగింపు బిల్లును కేంద్రం తీసుకొచ్చిందని పేర్కొన్నారు. ఇదంతా ఒక కుట్రలో భాగంగా జరుగుతుందన్నారు. దేశం అభివృద్ధి కంటే.. నాశనానికి హింసాత్మక వ్యూహాలుు రచిస్తున్నారన్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టించారని.. కొత్త చట్టం ద్వారా ఇప్పుడు ఇతరులను కూడా బెదిరించడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు, నిర్దిష్ట నాయకులను లక్ష్యంగా చేసుకునేందుకు ఈ బిల్లును తీసుకువస్తున్నారని ఆరోపించారు. అవసరమైతే నితీష్ కుమార్, చంద్రబాబుపై కొత్త కేసులు నమోదు చేసే అవకాశం ఉందని.. వాళ్లిద్దరిని అదుపులో ఉంచుకునేందుకు ఏమైనా చేస్తారన్నారు.

ఇది కూడా చదవండి: B Sudershan Reddy: ప్రతిపక్ష కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్‌రెడ్డి నామినేషన్

ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త బిల్లును ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసేందుకే ఈ బిల్లు తీసుకొస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. బుధవారం ఈ బిల్లును కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రవేశపెట్టారు.

Exit mobile version