Tejashwi Yadav: బీహార్‌లో మరోసారి బీజేపీ-జేడీయూ ప్రభుత్వం కొలువదీరబోతోంది. ఆర్జేడీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత మళ్లీ ఎన్డీయే కూటమిలోకి సీఎం నితీష్ కుమార్ చేరిపోయారు. ఈ రోజు సాయంత్రం బీజేపీ మద్దతుతో సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. బీజేపీ నుంచి ఇద్దరు ఉపముఖ్యమంత్రులు ఉండబోతున్నారు. ఇదిలా ఉంటే మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ ముఖ్యనేత, లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో తొలిసారిగా మాట్లాడారు.
Read Also: Animal : టాప్ ట్రెండింగ్ లో దూసుకోపోతున్న యానిమల్..సలార్ ను కూడా బీట్ చేసిందిగా..
ఇండియా కూటమి బలంగా ఉందని, ఏదైతే జరిగిందో అది తమ మంచికే జరిగిందని అన్నారు. నితీష్ కుమార్ తమతో ఉన్న సమయంలో చాలా అభివృద్ధి జరిగిందని చెబుతుండే వారని అన్నారు. నితీష్ కుమార్ సీఎంగా ఎప్పుడైనా నిరుద్యోగులకు అపాయింట్మెంట్ లెటర్స్ అందించారా..? అని ప్రశ్నించారు. నితీష్ కుమార్ అలసిపోయిన ముఖ్యమంత్రి అని, ఆట ఇప్పుడే ప్రారంభమైందని, ఆట ఇంకా మిగిలే ఉందని, 2024లో జేడీయూ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని తాను రాసివ్వగలనని అన్నారు. మేము చేసిన అభివృద్ధికి మేం ఎందుకు క్రెడిట్ తీసుకోవద్దు..? ఉద్యోగాలు ఇవ్వనని చెప్పని సీఎం హయాంలోనే ఉద్యోగాలు ఇచ్చి చూపించాం.. టూరిజం, ఐటీ, క్రీడల్లో అనేక పాలసీలు తీసుకువచ్చాం, 17 నెలల్లో మేము చేసిన అభివృద్ధి 17 ఏళ్లలో బీజేపీ-జేడీయూ పాలనలో చేయలేదని ఆయన అన్నారు.