Site icon NTV Telugu

Tejashwi Yadav: కుల గణనపై ప్రధాని మోడీకి తేజస్వి యాదవ్ లేఖ

Tejashwiyadav

Tejashwiyadav

కుల గణనపై ప్రధాని మోడీకి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ లేఖ రాశారు. జనాభా లెక్కలతో పాటు కుల గణన చేపట్టాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఆర్జేడీ స్వాగతించింది. తాజాగా ఇదే అంశంపై మోడీకి తేజస్వి యాదవ్ లేఖ రాశారు. కుల గణన కేవలం డేటా కోసం కాకుండా సాధికారిత కోసం చేపట్టాలని కోరారు. కేంద్ర నిర్ణయంతో దేశం సమానత్వం వైపు వెళ్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: Tummala Nageswara Rao: అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదు..

కుల గణన కేవలం ప్రభుత్వ ఉద్యోగానికి మాత్రమే పరిమితం కాకుండా ప్రైవేటు రంగంలోనూ దీన్ని అమలు చేయాలన్నారు. సేకరించే డేటా సుదూర వ్యవస్థాగత సంస్కరణలకు ఆధారం అయ్యేలా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఇది కూడా చదవండి: Virat Kohli: హాట్ బ్యూటీ ఫొటోకి లైక్.. నెట్టింటా రచ్చ.. క్లారిటీ ఇచ్చిన కోహ్లీ

ఏం సూచించారంటే..
▪️ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు
▪️కాంట్రాక్టుల్లో రిజర్వేషన్లు
▪️న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లు
▪️కుల గణన డేటా ఆధారంగా దామాషా రిజర్వేషన్లు
▪️పెండింగ్‌లో ఉన్న మండల్ కమిషన్ సిఫార్సులను పూర్తిగా అమలు చేయడం వంటి డిమాండ్లను తేజస్వి యాదవ్ సూచించారు.

 

Exit mobile version