Tejashwi Yadav: వీల్‌చైర్‌లో అసెంబ్లీకి వచ్చిన తేజస్వి యాదవ్.. ఏమైందంటే..!

  • వీల్‌చైర్‌లో అసెంబ్లీకి వచ్చిన తేజస్వి యాదవ్
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
  • ఏం జరిగిందో చెప్పిన ప్రతిపక్ష నేత
Tejashwi Yadav

Tejashwi Yadav

ఆర్జేడీ నేత, బీహార్ ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌ సోమవారం అసెంబ్లీకి వీల్‌చైర్‌లో వచ్చారు. అధికారులు ఆయన్ను వీల్‌చైర్‌లో తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బీహార్‌లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు తేజస్వి యాదవ్ వీల్‌చైర్‌లో వచ్చారు. దీంతో ఆయనకు ఏమైందంటే మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. ఎడమ కాలి బొటనవేలుపై ఏదో గాయమైంది. నడవలేని పరిస్థితి తలెత్తడంతో వీల్‌చైర్‌లో వచ్చారు. అయితే ఏమైందంటే విలేకర్లు ప్రశ్నించగా.. ‘‘గోరు ఊడిపోయింది.. ఇలాంటివి కొన్ని సార్లు జరుగుతుంటాయి.’’ అని చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: UP Video: సీఎం యోగిని కలిసిన చిన్నారి.. ఏం కోరిక కోరిందంటే..!

ఇటీవలే తేజస్వి యాదవ్‌కు ప్రమోషన్ దక్కింది. ఆర్జేడీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. అలాగే సోదరుడు తేజ్ ప్రతాప్ కూడా సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఇటీవల సంక్రాంతి పండుగ సమయంలో ఇద్దరూ కలిశారు. గతేడాది నవంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీ ఘోరంగా ఓడిపోయింది.