Site icon NTV Telugu

Bihar: ‘‘ఎన్నికల డ్రామా’’.. అన్ని తెలిసీ నాతో ఎందుకు పెళ్లి చేశారు..? లాలూ మాజీ కోడలు ఆగ్రహం..

Lalu

Lalu

Bihar: అసెంబ్లీ ఎన్నికల ముందు బీహార్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్ వ్యవహారం ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఇటీవల, తేజ్ ప్రతాప్ తన ప్రియురాలు అనుష్క యాదవ్‌ని ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా పరిచయం చేశాడు. తామిద్దరం 12 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, రిలేషన్‌లో ఉన్నామని చెప్పారు. దీని తర్వాత, లాలూ ఆర్జేడీ నుంచి తేజ్ ప్రతాప్‌ని 6 ఏళ్ల బహిష్కరించారు. పార్టీతో, కుటుంబంతో సంబంధం లేదని చెప్పారు. అతను ‘‘నైతిక ప్రవర్తన ఉల్లంఘన’’ కారణంగా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

Read Also: India China: చైనా దొంగ బుద్ధి.. ఐదుగురు పాకిస్తాన్ ఉగ్రవాదులపై ఆంక్షలకు మోకాలడ్డు..

అయితే, ఈ వ్యవహారంపై తేజ్ ప్రతాప్ యాదవ్ మాజీ భార్య ఐశ్వర్యా రాయ్ స్పందించారు. ‘‘వారిద్దరు కలిసి ఉన్నారు. వారు విడిపోలేదు, ఎన్నికలు దగ్గరపడ్డాయి, అందుకే వారు అలాంటి చర్యలు తీసుకుని డ్రామా సృష్టించారు’’ అని అన్నారు. తన జీవితం ఎందుకు నాశనం చేశారని లాలూ కుటుంబాన్ని ఆమె ప్రశ్నించింది. తాను వివాహ సమయంలో అనేక వేధింపులు ఎదుర్కొన్నట్లు చెప్పింది. లాలూ కుటుంబం తనను కొట్టిన సమయంలో సామాజిక న్యాయం ఎక్కడి వెళ్లిందో వారిని అడగాలి అని అన్నారు. నేను చేయని తప్పులకు, వారి కొడుకు చేసిన తప్పులను దాచడానికి నన్ను నిందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘అతను (తేజ్ ప్రతాప్ యాదవ్) 12 ఏళ్ల సుదీర్ఘ ప్రేమ వ్యవహారంలో ఉన్నాడని ఇప్పుడు అందరికి తెలిసింది. లాలూజీ, రబ్రీదేవీ లేదా తేజస్వీలకు తెలియదని మీరు అనుకుంటున్నారా..? వారు ఎల్లప్పుడు స్త్రీలను నిందిస్తుంటారు’’ అని అన్నారు. విడాకుల గురించి వారు తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఐశ్వర్య చెప్పారు. ఏం జరిగిందో తనకు అర్థం కాలేదని, తన విడాకుల విషయం మీడియా ద్వారా తెలిసిందని ఆమె చెప్పింది. అన్ని తెలిసి కూడా నాతో అతడికి ఎందుకు వివాహం జరిపించారు..? నన్ను ఎందుకు కొట్టారు..? ప్రతీ దానికి ఎందుకు నన్ను నిందించారు..? అని ప్రశ్నించారు. నాకు న్యాయం ఎప్పుడు లభిస్తుంది..? నేను పోరాటం కొనసాగిస్తాను అని అన్నారు.

Exit mobile version