Teen her 37 year old boyfriend kill parents with hammer cooker cops: ప్రేమ పేరుతో యువతులపై కొందరు దాడులకు పాల్పడుతుంటే, మరి కొందరు వారి ప్రేమకు అడ్డు పడుతున్న కనీపెంచిన తల్లిదండ్రులనే హతమార్చేందుకు సిద్దపడుతున్నారు. ఆమె వయస్సు 15 ఏళ్లు తన కంటే పెద్దవాడైన 37 ఏళ్ల వ్యక్తితో ప్రేమలో పడింది. నిరాకరించిన తల్లిదండ్రులను అతికిరాతంగా ప్రియుడితో కలిసి హతమార్చించి ఈ ఘటన జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లాలో చోటుచేసుకుంది.
జార్ఖండ్‌లోని తూర్పు సింగ్‌భూమ్ జిల్లా జంషెడ్‌పూర్ లోని మానిఫిట్ కు చెందిన 15 ఏళ్ల యువతి, తనకంటే ఎక్కువ వయస్సు వున్న 37 వ్యక్తిని ప్రేమించింది. దీంతో తల్లిదండ్రులు ఎక్కడ ఆ కూతురు చేయరాని తప్పు చేస్తుందో అని భయపడ్డారు. దీంతో కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చిన వారు అలాంటి తప్పు చేయెద్దని కూతురుని మందలించారు. కానీ ఆకూతురు అతని వ్యామోహంలో పడిపోయిందని గ్రహించిన తల్లిదండ్రులు తీవ్రంగా ఖండించారు. దీంతో ఎలాగైనా తన ప్రియుడితో పారిపోయి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేసారు వారిద్దరు. అర్దరాత్రి ప్రియురాలి ఇంటి వద్దకు వచ్చిన ఆవ్యక్తి తనను తీసుకు వెల్లేందుకు ప్రయత్నించగా, నిద్ర నుంచి మేలుకున్న తల్లిదండ్రులపై ప్రియుడు, కూతురు దాడి చేసారు.
read also: Astrology : ఆగస్టు 10, బుధవారం దినఫలాలు
సుత్తి, ప్రెషర్ కుక్కర్ తో వారిని దారుణంగా కొట్టారు. రక్తం కారుతున్నా కనికరం చూపలేదు. సుత్తితో అతి క్రూరంగా వారి తలపై కొట్టి అక్కడినుంచి స్కూటీపై పరాయ్యారు. మరుసటి రోజు (సోమవారం) ఉదయం ఇంటి ప్రధాన గేటు తెరిచి ఉండటాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు ఇద్దరి మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతుల కుమార్తె మిస్సింగ్ కేసుగా భావించారు. రక్తపు మడుగులో వున్న సుత్తి, ప్రెషర్ కుక్కర్ ను, స్వాధీనం చేసుకున్నారు.
పోలీసు సూపరింటెండెంట్ (సిటీ) కె. విజయ్ శంకర్ ఘటనకు సంబందించిన వివరాలు వెల్లడించారు. అయితే ఈ ఘటనపై సీరియస్ గా తీసుకున్న పోలీసులు 24 గంటల్లో ఈ కేసు ఛేదించారు. విచారణలో ఖంగుతినే నిజాలు బయటకు రావడంతో.. షాక్ కు గురయ్యారు. తల్లిదండ్రులను హతమార్చింది కూతురు, అతని ప్రియుడే అని తేల్చిచేప్పారు. టెల్కో పోలీస్ స్టేషన్ పరిధిలోని మానిఫిట్ లో తల్లిదండ్రులు కొట్టి అక్కడునుంచి నిందితులు స్కూటీలో ఇద్దరు పరాయ్యారని పేర్కొన్నారు. బిర్సానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓమ్‌నగర్‌లోని ప్రియుడు అద్దెకు ఇంటిలో వున్నట్లు గమనించిన పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆమె ప్రియుడు అక్కడే వుండటంతో పోలీసులు వారిని అదుపులో తీసుకుని, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిపై 302 ఐపిసి పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసామని పోలీసులు తెలిపారు.