Tech layoffs: అనేక టెక్ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకున్నారు. ఈ పరిణామాలు టెక్కీల్లో ఆందోళన నింపుతోంది. తాజాగా, దేశీయ సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్(TCS) 12000 మందిని తొలగించబోతున్నట్లు ప్రకటించింది. మారుతున్న వ్యాపార అవసరాలు, ఖర్చుల్ని తగ్గించకునేందుకు ఇలా లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. మరోవైపు, కృత్రిమ మేధస్సు (AI) ప్రభావానికి అనుగుణంగా వేలాది మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఈ కోతలు సామర్థ్యం, పునర్నిర్మాణంలో భాగంగా చేస్తున్నామని చెబుతోంది.
గత రెండేళ్ల కాలంగా అంతర్జాతీయ టెక్ దిగ్గజాలతో పాటు దేశీయ టెక్ దిగ్గజ కంపెనీలు చాలా వరకు రిక్రూట్లను ఆపేశాయి. ఇప్పుడు, ఉన్న ఉద్యోగులను తీసేసి, వర్క్ ఫోర్స్‌ని తగ్గించుకోవాలని చూస్తున్నాయి. ఏఐ వచ్చిన తర్వాత కంపెనీల్లో కొన్ని రోల్స్ అవసరం లేదని సంస్థలు భావిస్తున్నాయి.
టీసీఎస్ లేఆఫ్స్:
భారతదేశంలోని అతిపెద్ద IT సంస్థ అయిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), దాని ప్రపంచ శ్రామిక శక్తిని సుమారు 2 శాతం తగ్గిస్తోంది, ఇది దాదాపు 12,000 మంది ఉద్యోగులను ప్రభావితం చేస్తుంది. ప్రస్తుత ప్రాజెక్ట్ అవసరాలకు సరిపోని ఉద్యోగులను తిరిగి పునర్నియామకం చేయడానికి పరిమిత ఎంపికల కారణంగా తొలగింపులు జరుగుతున్నాయని టీసీఎస్ సీఈఓ కే కృతివాసన్ చెప్పారు. AI- ఆధారిత ఉత్పాదకత లాభాల ఈ లేఆఫ్స్ ప్రకటించలేదని కంపెనీ చెబుతోంది. ముఖ్యంగా మధ్య, సీనియర్ స్థాయిల్లోని ఉద్యోగులు ప్రభావితం కానున్నారు.
మెక్రోసాఫ్ట్ లేఆఫ్స్:
మైక్రోసాఫ్ట్ కూడా ఈ ఏడాది 15,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. దీంతో పాటు అండర్ పెర్ఫార్మర్లుగా ముద్రపడిన 2000 మందిని కూడా కంపెనీ నుంచి నిష్క్రమించారు. మైక్రోసాఫ్ట్ ఆదాయం, స్టాక్స్ ధరలు రికార్డు స్థాయిలో ఉన్నప్పటికీ ఉద్యోగుల తీసివేత జరుగుతోంది. ఉద్యోగులకు రాసిన మెమోలో సీఈఓ సత్యా నాదేళ్ల తొలగింపుల్ని అంగీకరించారు. మైక్రోసాప్ట్ ఏఐ మౌలిక సదుపాయాల కోసం దాదాపుగా 80 బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతోంది. దీంతోనే ఖర్చుల్ని తగ్గించుకోవడానికి ఉద్యోగుల్ని తీసేస్తున్నట్ల తెలుస్తోంది.
ఇంటెల్ లేఆఫ్స్:
ఇంటెల్ ఈ సంవత్సరం అతిపెద్ద కోతలలో ఒకటిగా చేస్తోంది, దాని ఉద్యోగులను దాదాపు 24,000 మంది ఉద్యోగులను తగ్గించాలని యోచిస్తోంది – ఇది దాని మొత్తం సిబ్బందిలో దాదాపు పావు వంతు. దీంతో పాటు జర్మనీ, పోలాండ్ ఫ్యాక్టరీ ప్రాజెక్టుల్లో కొన్నింటిని రద్దు చేస్తోంది. కొస్టారికా నుంచి వియత్నాంకు వర్క్‌ని తరలిస్తోంది. చిప్‌మేకర్ అయిన ఇంటెల్, ఎన్విడియా నుంచి తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది.
మెటా తొలగింపులు:
మెటా దాని రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో తాజా ఉద్యోగుల లేఆఫ్స్‌ని ప్రకటించింది. కంపెనీ ఖచ్చితమైన సంఖ్యలను పంచుకోనప్పటికీ, సూపర్‌నేచురల్ ఫిట్నెస్ యాప్ వంటి కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులపై పనిచేస్తున్న టీమ్‌లు ప్రభావితమయ్యాయి. ఈ ఏడాది ప్రారంభంలో మెటా కూడా తన వర్క్‌ఫోర్స్ నుంచి 5 శాతం మందిని తొలగించింది.
పానాసోనిక్ లేఆఫ్స్:
జపాన్ టెక్ దిగ్గజం పానాసోనిక్ కూడా లేఆఫ్స్ జాబితాలో చేరింది. ఖర్చుల్ని తగ్గించడానికి, ఏఐ వంటి భవిష్యత్ టెక్నాలజీపై మరింత ఖర్చు పెట్టడానికి 10,000 ఉద్యోగాలను తగ్గించాలని ప్లాన్ చేసుకుంది. ఈ కోతల్లో సగం జపాన్‌లోనే ఉన్నాయి. మిగిలిన ఉద్యోగాలు విదేశాల్లో ఉన్నాయి.