Tech layoffs: అనేక టెక్ కంపెనీలు వేలాది మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకున్నారు. ఈ పరిణామాలు టెక్కీల్లో ఆందోళన నింపుతోంది. తాజాగా, దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ టాటా కన్సెల్టెన్సీ సర్వీసెస్(TCS) 12000 మందిని తొలగించబోతున్నట్లు ప్రకటించింది. మారుతున్న వ్యాపార అవసరాలు, ఖర్చుల్ని తగ్గించకునేందుకు ఇలా లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. మరోవైపు, కృత్రిమ మేధస్సు (AI) ప్రభావానికి అనుగుణంగా వేలాది మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఈ కోతలు సామర్థ్యం, పునర్నిర్మాణంలో భాగంగా చేస్తున్నామని చెబుతోంది.
Intel layoffs: మరో టెక్ సంస్థ భారీ మొత్తంలో ఉద్యోగుల్ని తొలగించేందుకు సిద్ధమైంది. చిప్‌మేకర్ ‘‘ఇంటెల్’’ పునర్నిర్మాణంలో భాగంగా ఏకంగా 25,000 మంది కన్నా ఎక్కువ ఉద్యోగులకు ఉద్వాసన పలకాలని భావిస్తోందని ది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. 2025 చివరి నాటికి తన ఉద్యోగుల సంఖ్యను 75,000 మందికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతేడాది చివరి నాటికి ఇంటెల్‌లో మొత్తం 1,08,900 మంది ఉద్యోగులు ఉన్నారు.