NTV Telugu Site icon

Viral: ఐదేళ్ల బాలుడిపై క్రూరత్వం.. ఏంది సారు ఇది..!

Teacher

Teacher

విద్యా బుద్ధులు నేర్పి విద్యార్థులను సన్మార్గంలో నడపాల్సిన ఓ ఉపాధ్యాయుడు క్రూరుడిగా మారిపోయాడు.. ఐదేళ్ల బాలుడిపై కిరాతంగా ప్రవర్తించాడు.. కర్రతో కొట్టి, చెంపలు వాయించి, పిడిగుద్దులు గుద్ది, కిందపడిపోయినా.. కనీసం కనికరం లేకుండా కర్కశంగా ప్రవర్తిస్తూ.. ఐదేళ్ల బాలుడిని చిత్ర హింసలకు గురిచేశాడు.. బీహార్‌లో జరిగిన ఈ దారుణమైన ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోగా.. నిందితుడైన యువకుడిపై మండిపడుతున్నారు నెటిజన్లు..

Read Also: Birthday Poster: ‘విక్రమ్ గౌడ్’ కోసం రగ్గడ్ లుక్ తో కిరణ్ రాజ్!

బీహార్‌ రాజధాని పాట్నాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వీర్ ఒరియా ప్రాంతంలో జయ పేరుతో కోచింగ్‌ సెంటర్‌ నడుస్తోంది.. ఆ సెంటర్‌లో చోటు అనే యువకుడు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తుండగా.. తాజాగా, ఓ ఐదేళ్ల బాలుడి పట్ల క్రూరంగా ప్రవర్తించాడు.. సరిగ్గా చదవడం లేదన్న కారణంతో విచక్షణారహితంగా ప్రవర్తించాడు.. ఆ బాలుడి పిరుదులపై కర్రతో దారుణంగా కొట్టాడు.. ఆ బాలుడు ఏడుస్తున్నా.. కొట్టొద్దని ప్రాదేయపడినా కనికరం చూపలేదు.. ఆ కర్ర విరిగేదాగా కొట్టాడు.. అంతటితో ఆగకుండా చెంపలు వాయించాడు.. ఆ తర్వాత బాలుడిపై పిడిగుద్దలతో విరిచుకుపడ్డాడు.. నెలపై పడిపోయినా వదలకుండా.. గట్టిగా అరిస్తూ చిత్ర హింసలకు గురిచేశాడు.. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన ఆ బాలుడు స్పృహ తప్పి పడిపోయాడంటే.. ఆ ఉపాధ్యాయుడు ఎంత క్రూరంగా ప్రవర్తించాడో అర్థం చేసుకోవచ్చు.. ఇక, సమాచారం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రలు.. వెంటనే ఆ కోచింగ్‌ సెంటర్‌కు చేరుకుని బాలుడిని ఆస్పత్రికి తరలించారు.. ఆ తర్వాత నిందితుడిపై దాడి చేశారు.. వారి దాడిలో నిందితుడైన టీచర్‌ చోటుకు కూడా తీవ్రగాయాలైనట్టు తెలుస్తోంది.. అయితే, బాలుడి పట్ల కర్కశంగా ప్రవర్తించిన ఆ వీడియోను అక్కడ పనిచేసే ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో.. వైరల్‌గా మారిపోయింది.