Modi-Priyanka Gandhi: మోడీ-ప్రియాంకాగాంధీ భేటీ.. దేనికోసమంటే..!
- ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
- 19 రోజుల పాటు సాగిన సమావేశాలు
- టీ పార్టీలో మోడీ-ప్రియాంకాగాంధీ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. డిసెంబర్ 1న ప్రారంభమైన సమావేశాలు డిసెంబర్ 19తో ముగిశాయి. 19 రోజుల పాటు జరిగిన సమావేశాలు… ఆందోళనలు.. నిరసనలతోనే ముగిశాయి. ఇక చివరిలో ‘జీ-రామ్-జీ’ బిల్లు తీవ్ర దుమారం రేపింది. బిల్లుకు వ్యతిరేకంగా విపక్ష సభ్యులంతా ఆందోళన చేపట్టారు. మొత్తానికి నిరసనల మధ్యే బిల్లు ఆమోదం పొందింది.

Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఇదిలా ఉంటే శుక్రవారం పార్లమెంట్ సమావేశాలు ముగిశాయి. అయితే సమావేశాల ముగింపులో సంప్రదాయం ప్రకారం ప్రధాని ‘టీ’ పార్టీ ఏర్పాటు చేస్తుంటారు. దీంతో సభ్యులందరికీ ప్రధాని మోడీ టీ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంగాగాంధీ, సుప్రియా సూలే, తదితర అధికార, ప్రతిపక్ష సభ్యులంతా పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈ సమావేశం సందర్భంగా ఆయా అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గురువారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ప్రియాంకాగాంధీ కలిశారు. వయనాడ్ రహదారులపై చర్చించారు.

ఇదిలా ఉంటే పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు ముందు ‘ఢిల్లీ కాలుష్యం’పై చర్చకు డిమాండ్ చేస్తామని విపక్ష పార్టీలు అన్నాయి. తీరా చూస్తే.. అలాంటి ఊసే లేకుండా సమావేశాలు ముగిసిపోవడం చర్చనీయాంశం అవుతోంది. శుక్రవరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధిక వాయిదా వేశారు. పలు బిల్లులు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ముఖ్యంగా ‘జీ-రామ్-జీ’ బిల్లు ఆమోదం పొందింది. విపక్షాల ఆందోళనలు మధ్యే బిల్లు ఆమోదం పొందింది. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ ఈ బిల్లు తీసుకొచ్చారు.

తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!