Site icon NTV Telugu

Taslima Nasreen: మహిళలు వాళ్లకు మనుషులు కాదు.. తాలిబాన్‌లపై తస్లీమా నస్రీన్..

Taslima Nasreen

Taslima Nasreen

Taslima Nasreen: 2021లో ఆఫ్ఘానిస్తాన్ లో తాలిబాన్‌లు అధికారంలోకి వచ్చిన తర్వాత, తొలిసారిగా ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత్‌లో పర్యటిస్తున్నారు. శుక్రవారం, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌తో ఆయన భేటీ అయ్యారు. ఆ తర్వాత, తాలిబాన్ ప్రతినిధి బృందం మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ఒక్క మహిళా జర్నలిస్టు లేకపోవడంపై చర్చ నడిచింది. తాలిబాన్లు మహిళల్ని దూరంగా పెడుతున్నారనే వాదన వినిపించింది.

Read Also: Karwa Chauth: మాకు పెళ్లిళ్లు కావడం లేదు, నీకు ఇద్దరు భార్యలు ఎలా బ్రో.? కార్వా చౌత్ వేడుకలు వైరల్..

ఇదిలా ఉంటే, ఈ వ్యవహారంపై బంగ్లాదేశ్ బహిష్కృత రచయిత్రి తస్లీమా నస్రీన్ ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకిపై తీవ్ర విమర్శలు చేశారు. తాలిబాన్‌లు ‘‘మహిళల్ని మనుషులుగా పరిగణించడం లేదు.’’ అని అన్నారు. మహిళలకు మానవహక్కుల్ని ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఢిల్లీలో ఆఫ్ఘన్ మంత్రి సమావేశానికి హాజరైన పురుష జర్నలిస్టులను కూడా ఆమె విమర్శించారు. మహిళలకు మద్దతుగా వారు వాకౌట్ చేసి ఉండాల్సిందని అన్నారు.

“ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకీ భారతదేశానికి వచ్చి విలేకరుల సమావేశం నిర్వహించారు. అయితే, ఆయన మహిళా జర్నలిస్టులను హాజరు కావడానికి అనుమతించలేదు. తాలిబాన్లు ఆచరించే ఇస్లాంలో, మహిళలు ఇంట్లోనే ఉండి, పిల్లలను కనాలని, వారి భర్తలు మరియు పిల్లలకు సేవ చేయాలని మాత్రమే భావిస్తున్నారు” అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ‘‘ఈ స్త్రీ ద్వేషపూరిత పురుషులు ఇంటి బయట ఎక్కడా స్త్రీలను చూడటానికి ఇష్టపడరు. పాఠశాలల్లో, పని ప్రాంతాల్లో స్త్రీలు ఉండొద్దని అనుకుంటారు. స్త్రీలను మానవులుగా పరిగణించనందుకు, వారికి మానవ హక్కులు ఇవ్వడానికి నిరాకరిస్తారు.’’ అని అన్నారు.

Exit mobile version