Tamil Nadu: మతం మారినా రిజర్వేషన్లు ఇవ్వాలి.. సుప్రీంకోర్టుకు విజయ్ సర్కార్..

  • మత మార్పిడి రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తమిళనాడు.
  • హైకోర్టు రద్దు చేసిన ప్రభుత్వ ఉత్తర్వును సవాలు.
  • ఇస్లాంలోకి మారినా రిజర్వేషన్లు కొనసాగించాలని ప్రభుత్వ వాదన.
Supreme Court

Supreme Court

Tamil Nadu: మతం మార్చుకున్న వెనబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కొనసాగించే విషయంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్రాస్ హైకోర్టు దీనిపై ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తూ ప్రత్యేక పిటిషన్ దాఖలు చేసింది. 2024 మార్చిలో అప్పటి డీఎంకే ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. బీసీ (BC), ఎంబీసీ (MBC), డీనోటిఫైడ్ కమ్యూనిటీలు (DNC), షెడ్యూల్డ్ కులాల (SC)కు చెందిన వ్యక్తులు హిందూమతం నుంచి ఇస్లాంలోకి మారినా, వారికి బ్యాక్‌వర్డ్ క్లాస్ ముస్లిం (BCM) కేటగిరీలో రిజర్వేషన్ ప్రయోజనాలు కొనసాగించాలని నిర్ణయించింది. సామాజికంగా వెనకబడిన వర్గాల వారికి మతమార్పిడి తర్వాత రిజర్వేషన్లు కోల్పోకుండా ఉండటమే ఈ నిర్ణయం ఉద్దేశమని అప్పటి ప్రభుత్వం తెలిపింది.

అయితే, ఈ ప్రభుత్వ ఉత్వర్వులు చట్టవిరుద్ధమని మదురై బెంచ్ ప్రకటించింది. కేవలం మతం మారినంత మాత్రాన వ్యక్తి రాష్ట్రంలో గుర్తించిన ఏడు బ్యాక్‌వర్డ్ క్లాస్ ముస్లిం కమ్యూనిటీల్లో సభ్యుడిగా పరిగణించలేమని స్పష్టం చేసింది. అన్సార్, డెక్కని ముస్లింలు, దుబెకులా, లబ్బాయి , మాపిళ్ల, షేక్, సయ్యద్ ఏడు వర్గాలను కోర్టు పేర్కొంది. ఇవి జన్మ ఆధారిత సమాజిక వర్గాలని, మత మార్పిడి ద్వారా వీటిలో సభ్యత్వం లభించదని వెల్లడించింది. ఇస్లాం సమానత్వాన్ని బోధించే మతమని, కుల హోదానున మతమార్పిడి ద్వారా పొందలేని చెప్పింది.

తమిళనాడు ప్రభుత్వం మాత్రం మత మార్పిడి జరిగినా సామాజిక, విద్యాపరమైన వెనుకబాటుతనం ఒక్కసారిగా తొలగిపోదని సుప్రీంకోర్టులో వాదించింది. రిజర్వేషన్లు కొనసాగించడం సామాజిక న్యాయ సూత్రాలకు అనుగుణమే అని పేర్కొంది. 2015లో హిందూ మతనం నుంచి ఇస్లాంలోకి మారిన సమీర్ అహ్మద్ అనే వ్యక్తి తనకు ముస్లిం లబ్బాయి కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇవ్వాలని కోరాగా, ఎంఆర్ఓ తిరస్కరించారు. దీంతో అతను హైకోర్టును ఆశ్రయించగా, చివరకు ప్రభుత్వ ఉత్వర్వును కోర్టు రద్దు చేసింది. ఇప్పుడు సీఎం విజయ్ సర్కార్ ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.