Tamil Nadu Rains.. floods in chennai: తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలతో జనజీవితం స్తంభిస్తోంది. ముఖ్యంగా రాజధాని చెన్నైలో శుక్రవారం రోజు భారీగా వర్షం కురిసింది. దీంతో ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంది. వరద గుప్పిట చెన్నై ఉంది. రోడ్లపైకి భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో గత వారం నుంచి తమిళనాడు వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రుతుపవనాల ప్రభావమే కాకుండా బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడటంతో తమిళనాడు, పుదుచ్చేరిలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Read Also: Bhart Jodo Yatra: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో పాల్గొన్న ఆదిత్య ఠాక్రే.
అల్పపీడనం ప్రభావంతో నవంబర్ 13 వరకు వర్షాలు కురవనున్నాయి. చెన్నైతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్‌పేట, విల్లుపురం జిల్లాలతో పాటు కడలూరు, తంజావూరు జిల్లాలతో సహా కావేరి డెల్టా ప్రాంతాలతో పాటు దక్షిణ రామనాథపురం జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మైలాడుతురై, కడలూరు, నాగపట్నం, కాంచీపురం, చెన్నై, తిరువళ్లూరు జిల్లాల్లో 7 నుంచి 11 సెంటీమీటర్ల భారీవర్షపాతం నమోదు అయింది. చెన్నైతో సహా 23 జిల్లాల్లోని పాఠశాలలు, కాలేజీలు మూతపడ్డాయి. పుదుచ్చేరిలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి.
భారీ వర్షాల కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. నైరుతి బంగాళాఖాతం, ఈశాన్య శ్రీలంక, తమిళనాడు తీర ప్రాంతాన్ని అనుకుడి అల్పపీడనం ఉంది. నవంబర్ 12 ఉదయం వరకు తమిళనాడు, పుదుచ్చేరి తీరం వైపు వాయువ్యదిశగా ప్రయాణించే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావం వల్ల దక్షిణ ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి, శ్రీలంక తీరం, గల్ఫ్ ఆఫ్ మన్నార్, కొమెరిన్ ప్రాంతాల్లో గాలుల వేగం గంటకు 40-45 కిలోమీటర్ల నుంచి 55 కిలోమీటర్ల వరకు ఉంటుందని తెలిపింది.