Kaveri river: శతాబ్దాలు గడుస్తున్నా కావేరి జలాల వివాదం మాత్రం ముగియడంలేదు. ఈ కావేరి జలాల పైన తమిళనాడు, కేరళ, కర్ణాటక మరియు పుదుచ్చేరికి హక్కు ఉంది. ఈ జలాల మీద వివాదాలు దశాబ్దాల కాలం కొనసాగాయి. చివరికి 2007వ సంవత్సరం లో వాదోపవాదాలు పరిశీలించి సుప్రీం కోర్డు నాలుగు ప్రాంతాలు కావేరి జలాలను ఎలా పంచుకోవాలి, ఎవరికీ ఎంత నీరు వస్తుంది అనే విషయాలపైన తీర్పు చెప్పింది. కాగా తాజాగా మరోసారి కావేరి జలాల వివాదం తెరపైకి వచ్చింది.
Read also:Tirumala: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నేడే..
వివరాలలోకి వెళ్తే.. కర్ణాటక సెప్టెంబర్ 13 నాటికి 5000 క్యూసెక్కుల నీటిని విడుదల చెయ్యాల్సి ఉంది. కానీ కర్ణాటక పూర్తి స్థాయిలో నీటిని విడుదల చెయ్యకుండా రెగ్యులేషన్ కమిటీ (సిడబ్ల్యుఆర్‌సి) ఆదేశాలను ఉల్లగించింది అని ఆరోపిస్తూ సెప్టెంబర్ 18 వ తేదీన కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ నేపథ్యంలో పీఎంకే రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ అన్బుమణి రామదాస్ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌కు పిలుపునిచ్చారు. కాగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో సమావేశమై రెండు రాష్ట్రాల సమస్యను పరిష్కరించనున్నారు.
ఈ వివాదం పైన స్పందించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తమిళనాడు కావేరీ నదీ జలాలను డిమాండ్ చెయ్యడం సమంజసం కాదని కర్ణాటక నిరాధారంగా మాట్లాడుతుందని ఆరోపించారు. తమిళనాడు ఆయకట్టు ప్రాంతాలను పెంచిందని కర్ణాటక కూడా ఆరోపించగా, ఇది నిరాధారమైన ఆరోపణ అని ముఖ్యమంత్రి అన్నారు. వివాదాలు రేకెత్తిన నేపథ్యంలో తమిళనాడు జలవనరుల శాఖ మంత్రి ఎస్. దురైమురుగన్ నేతృత్వంలోని ఎంపీల అఖిలపక్ష ప్రతినిధి బృందం న్యూఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో సమావేశం కానున్నారు. ఈ సమావేశం తారీకు ఇంకా ఖరారు కాలేదు. కాగా ఈ సమావేశంలో తమిళనాడుకి కావేరి జలాల ఆవశ్యకతను వివరించనున్నారు.