Site icon NTV Telugu

Tamil Nadu: కేంద్రం తీరుపై మళ్లీ సుప్రీంకోర్టుకు తమిళనాడు సర్కార్

Sc

Sc

Tamil Nadu: కేంద్రం- తమిళనాడు ప్రభుత్వాల మధ్య నిరంతరం వివాదం కొనసాగుతుంది. దీంతో మోడీ సర్కార్ తీరుపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది స్టాలిన్ ప్రభుత్వం. రూ.2,291 కోట్లకు పైగా విద్యా నిధులను కేంద్ర ప్రభుత్వం అక్రమంగా నిలిపివేసిందని ఆరోపిస్తూ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. జాతీయ విద్యా విధానం (NEP) 2020, PM SHRI పాఠశాలలు లాంటి సంబంధిత పథకాలను రాష్ట్రం అమలు చేసేలా చేయడానికి ఎన్డీయే ప్రభుత్వం ఆర్థిక ఒత్తిడిని ఉపయోగిస్తోందని తమిళనాడు ఆరోపించింది.

Read Also: Gold Rates: ఒక్కరోజులోనే ఇంత మార్పా.. రూ. 2,400 పెరిగిన తులం గోల్డ్ ధర

అయితే, రాష్ట్రానికి కేటాయించిన విద్యా నిధులను కేంద్రం నిలిపివేసినందుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 కింద సుప్రీంకోర్టులో నేరుగా కేసు వేసింది తమిళనాడు సర్కార్. ఆర్టికల్ 131 ప్రకారం, రాజ్యాంగ హక్కులకు సంబంధించిన వివాదాలలో కేంద్ర ప్రభుత్వాన్ని చట్టబద్ధంగా సవాలు చేయడానికి రాష్ట్రానికి అనుమతి ఉంటుందని అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా వెనుకబడిన వర్గాల పిల్లలకు పాఠశాల విద్యకు మద్దతు ఇచ్చే సమగ్ర శిక్ష పథకం (SSS) కింద రూ.2,291.30 కోట్ల నిధులను వెంటనే విడుదల చేయాలని స్టాలిన్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి మంజూరు చేయబడిన నిధులలో కేంద్రం 60 శాతం వాటాను మే 1వ తేదీ చెల్లింపు జరగలేదన్నారు.

Read Also: Vizag: ప్రపంచరికార్డు సృష్టించేలా అంతర్జాతీయ యోగా డే వేడుకలు.. విశాఖలో భారీ ఏర్పాట్లు

ఇక, సమగ్ర శిక్షా పథకం అనేది నాణ్యమైన విద్యను అందించడానికి లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం. ఈ పథకం మార్గదర్శకాలను పూర్తిగా పాటిస్తున్నట్లు అంగీకరిస్తూ.. ప్రాజెక్ట్ అప్రూవల్ బోర్డు (PAB) ఫిబ్రవరి 16, 2024న తమిళనాడు సర్కార్ ప్రతిపాదనను ఆమోదించిందని చెప్పుకొచ్చింది. అయితే, మే 21, 2025 నాటికి కేంద్రం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు అని తమిళనాడు తన పిటిషన్‌లో వెల్లడించింది.

Exit mobile version