Tamil Nadu: అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వాలని డీఎంకే చెప్పింది.. లెఫ్ట్ పార్టీల సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడులో విజయ్‌కు చెందిన టీవీకే పార్టీ అధికారంలోకి రాబోతోంది. విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు రూట్ క్లియర్ అయింది. లెఫ్ట్ పార్టీలు, వీసీకేలు విజయ్‌కి తమ మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే మద్దతుతో మ్యాజిక్ ఫిగర్ 118 సాధించారు. దీంతో విజయ్ ప్రభుత్వం తమిళనాడులో కొలువుదీరబోతోంది.
Read Also: Pakistan: ‘‘భారత సైన్యం ఎందుకు ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంది.?’’.. పాక్ ఆర్మీ ప్రశ్నపై ట్రోల్స్..
Also Read
ఇదిలా ఉంటే, ఈ రాజకీయ పరిణామాల సమయంలో సీపీఎం సంచలన వ్యాఖ్యలు చేసింది. తాము డీఎంకేను వీడి, విజయ్‌కు ఎందుకు మద్దతు ఇచ్చామనే విషయాన్ని సీపీఎం నేత ఎంఏ బేబీ వివరించాయి. ఇదే సమయంలో విజయ్‌కు గట్టి సందేశాన్ని కూడా ఇచ్చారు. అధికార సమీకరణాల నుంచి బీజేపీని దూరంగా ఉంచాలని, అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వాలన్న డీఎంకే ప్రతిపాదనను తాము వ్యతిరేకించడానికే టీవీకేకు మద్దతు ఇచ్చినట్లు లెఫ్ట్ పార్టీలు ప్రకటించాయి. వామపక్ష పార్టీలు అన్నాడీఎంకేకు మద్దతు ఇవ్వాలని డీఎంకే కోరుకుంటోందని ఎంఏ బేబీ శుక్రవారం అన్నారు.
ఇదే సమయంలో డీఎంకేతో వామపక్ష పార్టీల సైద్ధాంతిక రాజకీయ సంబంధం కొనసాగుతుందని వామపక్షాలు స్పష్టం చేశాయి. టీవీకే ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇస్తామని, ప్రభుత్వంలో ఎలాంటి మంత్రి పదవులు గానీ, క్యాబినెట్ పదవులు కానీ అడగబోమని బేబీ స్పష్టం చేశారు. ఇదే సమయంలో సీపీఐ నాయకుడు వీరపాండియన్ మాట్లాడుతూ.. తమిళనాడులో బీజేపీని అడ్డుకోవడానికే లెఫ్ట్ పార్టీలు విజయ్‌కి మద్దతు ఇచ్చాయని, భవిష్యత్తులో విజయ్ బీజేపీకి దగ్గరైతే సీపీఐ దానిని వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
-
OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
-
OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
-
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!