Tamil Nadu vs AP: తమిళనాడు రహస్యాలు ఏపీకి లీక్? విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం.. 15 మంది ఉద్యోగులపై వేటు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu vs AP: తమిళనాడులోని విజయ్ సర్కార్ సంచలనం నిర్ణయం తీసుకుంది.. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్య పారిశ్రామిక పెట్టుబడుల పోటీ ఇప్పుడు కొత్త వివాదానికి దారితీసింది. తమిళనాడుకు రావాల్సిన పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో పెట్టుబడులకు సంబంధించిన అత్యంత రహస్య సమాచారం ఏపీకి చేరిందనే ప్రచారం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం కీలక చర్యలకు ఉపక్రమించింది.. పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ గైడెన్స్ తమిళనాడుకు చెందిన సుమారు 15 మంది కాంట్రాక్టు ఉద్యోగులపై ప్రభుత్వం వేటు వేసింది.. అయితే ఈ ఉద్యోగుల తొలగింపునకు, సమాచారం లీక్ ఆరోపణలకు సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది..
ముగ్గురు ఉద్యోగులకు ఏపీలో ఉద్యోగాలు..
ఈ వివాదానికి ప్రధాన కారణం గతంలో గైడెన్స్ తమిళనాడులో పనిచేసిన ముగ్గురు ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి (APEDB)లో చేరడమే. క్రిస్టో లారెల్, ప్రభాకరన్ అండి, ప్రీజా ప్రసాద్ అనే ముగ్గురు మాజీ ఉద్యోగులు ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలిలో బాధ్యతలు స్వీకరించారు. వీరు గతంలో తమిళనాడులో పెట్టుబడుల ప్రోత్సాహక విభాగంలో పనిచేయడంతో పెట్టుబడులకు సంబంధించిన కీలక సమాచారం ఏపీకి చేరిందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖపట్నంలో జరిగిన సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్-2026 సందర్భంగా ఈ ముగ్గురు ఉద్యోగులు ఏపీ తరఫున కనిపించడం, వారికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం వివాదాన్ని మరింత పెంచింది. ఈ సదస్సులో ఏపీకి భారీ పెట్టుబడుల ప్రతిపాదనలు రావడంతో తమిళనాడు పెట్టుబడుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది.
Also Read
- Supreme Court: కావేరీ జలాల వివాదంలో తమిళనాడుకు భారీ ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
- SCO Forum 2026: నేడు తొలి SCO ఫోరమ్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. ఢిల్లీలో 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు
- Supreme Court: హైవేలపై వీధి పశువుల సమస్య పరిష్కారానికి రూ.5 వేల కోట్లు.. చేతులెత్తేసిన ఎన్హెచ్ఏఐ
- PM Modi Warns Corporates: కార్పొరేట్ కంపెనీలకు ప్రధాని మోడీ షాక్.. ఎంత ఇచ్చినా మీ ఆకలి తీరదా?
మంత్రి కీర్తన సమీక్షలతో వెలుగులోకి వచ్చిన వ్యవహారం?
తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి ఎస్. కీర్తన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు దఫాలుగా శాఖలో సమీక్షలు నిర్వహించినట్లు సమాచారం. ఈ సమీక్షల్లో కొందరు ఉద్యోగుల వ్యవహారశైలిపై అనుమానాలు రావడంతో జూలైలోనే వారిని విధుల నుంచి తొలగించినట్లు వార్తలు చెబుతున్నాయి. అయితే ఉద్యోగులపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు, దర్యాప్తు వివరాలు బహిరంగంగా వెల్లడికాలేదు. మరోవైపు తనపై డీఎంకే కావాలనే రాజకీయ కుట్రలు చేస్తోందని కీర్తన ఆరోపిస్తున్నారు.. అయితే ఈ వ్యవహారంలో మరో కోణం కూడా వెలుగులోకి వచ్చింది. తాము ప్రభుత్వంచే తొలగించబడలేదని, పని వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో స్వచ్ఛందంగానే రాజీనామా చేశామని కొందరు మాజీ ఉద్యోగులు చెబుతున్నారు. తమపై పెట్టుబడుల సమాచారం లీక్ చేశారనే ఆరోపణలు నిరాధారమని వారు ఖండించినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అసలు ఉద్యోగుల తొలగింపు వెనుక ఏం జరిగింది? పెట్టుబడుల సమాచారం నిజంగానే లీక్ అయిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తమిళనాడు పెట్టుబడులు ఏపీకి తరలిపోతున్నాయా?
మరోవైపు తమిళనాడుకు రావాల్సిన పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్‌కు తరలిపోతున్నాయంటూ గతంలో డీఎంకే నేతలు విమర్శలు చేశారు. ముఖ్యంగా దక్షిణ కొరియాకు చెందిన హ్వాషిన్, సియోన్, ఇవామెట్ సంస్థలు అనంతపురంలో రూ.1,614 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం ఈ చర్చకు మరింత ప్రాధాన్యతనిచ్చింది. ఈ సంస్థలు హ్యుందాయ్, కియా వంటి ఆటోమొబైల్ కంపెనీలకు విడిభాగాలు సరఫరా చేస్తాయి. అయితే, తమిళనాడు నుంచి వచ్చిన ఉద్యోగుల ద్వారా రహస్య సమాచారం సేకరించామన్న ఆరోపణలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించలేదు. ఏపీ తన సొంత పారిశ్రామిక విధానాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణం కారణంగానే పరిశ్రమలను ఆకర్షిస్తోందని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ వివాదంపై ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి కూడా అధికారికంగా స్పందించలేదు.
మొత్తంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మధ్య పెట్టుబడుల ఆకర్షణ పోటీ ఇప్పుడు ఉద్యోగుల తొలగింపులు, రహస్య సమాచారం లీక్ ఆరోపణలు, రాజకీయ విమర్శలతో మరింత వేడెక్కింది. అయితే నిజంగానే పెట్టుబడులకు సంబంధించిన కీలక సమాచారం ఏపీకి లీక్ అయిందా? లేక ఉద్యోగుల రాజీనామాలను రాజకీయ వివాదంగా మారుస్తున్నారా? అన్నది తేలాల్సి ఉంది.
తాజావార్తలు
-
Tamil Nadu vs AP: తమిళనాడు రహస్యాలు ఏపీకి లీక్? విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం.. 15 మంది ఉద్యోగులపై వేటు!
-
Kantar BrandZ 2026: ఎయిర్టెల్ నంబర్ 1.. మరి జియో ఎక్కడ? కాంతార్ 2026 ర్యాంకింగ్స్‌లో ఆసక్తికర ట్విస్ట్!
-
Ramayana vs Dangal: 2 వేల కోట్లకు చేరువలో ‘రామాయణ’.. ‘దంగల్’ రికార్డు బద్దలు కొట్టాలంటే ఇంకా..!
-
Supreme Court: కావేరీ జలాల వివాదంలో తమిళనాడుకు భారీ ఎదురుదెబ్బ.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
-
MP YS Avinash Reddy Arrest: కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!