NTV Telugu Site icon

Tamil Nadu: గవర్నర్, ప్రభుత్వం మధ్య మరో వివాదం.. కాకరేపుతోన్న “పొంగల్” ఇన్విటేషన్

Tamil Nadu

Tamil Nadu

Governor vs CM in Tamil Nadu: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, సీఎం స్టాలిన్ ప్రభుత్వాల మధ్య వివాదం మరింతగా ముదురుతోంది. ఇప్పటికే అసెంబ్లీలో గవర్నర్ రవి ప్రసంగంపై డీఎంకే పార్టీ మండిపడుతోంది. గవర్నర్ తీరుపై సీఎం స్టాలిన్ అసెంబ్లీలోనే తీర్మానం పెట్టారు. గవర్నర్ ప్రసంగాన్ని రికార్డుల్లో చేర్చవద్దని అసెంబ్లీ తీర్మానించింది. ఈ చర్యతో అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్ చేశారు. దీని తర్వాత ‘గెట్ అవుట్ రవి’ యాష్ ట్యాగుని డీఎంకే పార్టీ ట్విట్టర్ లో ట్రెండింగ్ అయ్యేలా చేసింది.

Read Also: IND Vs SL: తొలి వన్డేలో టాస్ గెలిచిన శ్రీలంక.. ఇషాన్ కిషన్, సూర్యకుమార్‌లకు దక్కని చోటు

ఇదిలా ఉంటే గవర్నర్ ‘పొంగల్’ ఆహ్వానం సరికొత్త వివాదానికి కేంద్ర బిందువు అయింది. గవర్నర్ ఈ ఆహ్వనంలో కేంద్ర ప్రభుత్వ చిహ్నాన్ని మాత్రమే ఉపయోగించారని.. రాష్ట్ర చిహ్నాన్ని ఉపయోగించలేదని ద్రావిడ పార్టీలు మండిాపడుతున్నాయి. గవర్నర్ ఆర్ఎన్ రవి ఇంగ్లీష్, తమిళంలో ‘తమిళనాడు’ రాష్ట్రాన్ని రెండు విధాలుగా సంబోధించడం తాాజా వివాదానికి కారణం అయింది. తమిళ ఆహ్వనంలో ‘తమిళగం’ గవర్నర్ (తమిళంలో) అని పేర్కొనగా.. ఇంగ్లీష్ లో తమిళనాడు అని పేర్కొన్నారు. తమిళగం అనేది తమిళనాడు రాష్ట్రాన్ని పిలిచి పురాతన పద్దతి. దీనికి ‘తమిళ ప్రజల భూమి’అని అర్థం.

ఇక గవర్నర్ కేవలం కేంద్ర ప్రభుత్వ చిహ్నాన్ని మాత్రమే ఉపయోగించారని, రాష్ట్ర చిహ్నాన్ని ఉపయోగించలేదని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియన్ (మార్క్సిస్ట్) ఎంపీ సు వెంకటేశన్, తమిళనాడు లోగోను ఎందుకు ఉపయోగించలేదని ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. అంతకుముందు నీట్ వివాదంలో తమిళనాడు గవర్నర్ రవిపై అక్కడి పార్టీలు వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ఏప్రిల్ 14,2022న తమిళనాడు గవర్నర్ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే), దాని మిత్ర పక్షాలు బహిష్కరించాయి. నీట్ వ్యతిరేఖ బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం గవర్నర్ పంపకపోవడంతో నిరసనగా బహిష్కరించాయి.

Show comments