Tamil Nadu: గవర్నర్ మళ్లీ ట్విస్ట్.. విజయ్‌కు నో అపాయింట్‌మెంట్.. వెనక్కి వెళ్లిపోయిన టీవీకే అధినేత

  • తమిళనాడు గవర్నర్ మళ్లీ ట్విస్ట్
  • విజయ్‌కు నో అపాయింట్‌మెంట్
  • వెనక్కి వెళ్లిపోయిన టీవీకే అధినేత
  • గవర్నర్ తీరుపై మండిపడుతున్న అభిమానులు
Tamilnadu2

Tamilnadu2

తమిళనాడు గవర్నర్ అర్లేకర్ మళ్లీ విజయ్‌కు ట్విస్ట్‌ ఇచ్చారు. ఇప్పటి దాకా మ్యాజిక్ ఫిగర్ లేదని మూడు సార్లు వెనక్కి పంపిన గవర్నర్.. తాజాగా సంపూర్ణ బలం వచ్చాక  విజయ్‌ను కలిసేందుకు నిరాకరించారు. గవర్నర్‌ను కలిసేందుకు లోక్‌భవన్‌కు వెళ్లిన విజయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. గవర్నర్ అయిపాయింట్ ఇవ్వకపోవడంతో లోక్‌భవన్ దాకా వెళ్లి తిరిగి టీవీకే కార్యాలయానికి వచ్చేశారు.

ఈ రాత్రి 7:30కు కేరళం వెళ్లేందుకు గవర్నర్ అర్లేకర్ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ముందస్తు అపాయింట్‌మెంట్లు ఉండడంతో విజయ్‌కు అపాయింట్‌మెంట్ ఇవ్వలేకపోయినట్లుగా లోక్‌భవన్ కార్యాలయం చెబుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామంపై టీవీకే అభిమానులు, నేతలు మండిపడుతున్నారు. గవర్నర్ కావాలనే గేమ్ ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

×
×
Ad

తాజాగా విజయ్ బలం వీసీకే, ముస్లిం లీగ్ పార్టీల మద్దతు 120కి చేరింది. ఆ పార్టీలు సంపూర్ణ మద్దతు తెల్పాయి. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం అయిందని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో విజయ్‌కు గవర్నర్ అపాయింట్‌మెంట్ నిరాకరించడంతో అంతా అవాక్కయ్యారు.

సోమవారం వెలువడిన ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే మాత్రమే 108 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించవచ్చని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా అంచనాలు తారుమారయ్యాయి. పూర్తి మ్యాజిక్ ఫిగర్‌తో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని విజయ్‌కు సూచించారు. దీంతో కాంగ్రెస్, వామపక్షాల మద్దతు ఇవ్వడంతో విజయ్ బలం 116కు చేరింది. అయితే మరో రెండు స్థానాలు ఉన్న వీసీకేకు చెందిన పార్టీ మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తగ్గింది. దీంతో మ్యాజిక్ ఫిగర్‌కు విజయ్ చేరుకోకపోవడంతో రాజకీయ అనిశ్చితి అలానే కొనసాగుతోంది. మొత్తానికి శనివారం వీసీకే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వీసీకేతో పాటు ముస్లిం లీగ్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. దీంతో విజయ్ బలం 120కి చేరింది.