Tamil Nadu: గవర్నర్ యూటర్న్.. కేరళం టూర్ రద్దు.. విజయ్‌కు అపాయింట్‌మెంట్

  • తమిళనాడు గవర్నర్ యూటర్న్
  • కేరళం టూర్ రద్దు
  • విజయ్‌కు అపాయింట్‌మెంట్
Vijay5

Vijay5

హమ్మయ్య.. గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ మనసు మార్చుకున్నారు. కేరళం పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో శనివారం సాయంత్రం 6:30 గంటలకు విజయ్‌కు గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయ అనిశ్చితి కొనసాగడంతో గవర్నర్ వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది.

ప్రస్తుతం లోక్‌భవన్ దగ్గరలోనే పార్టీ నేత ఇంట్లో విజయ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. మరికాసేపట్లో లోక్‌భవన్‌కు విజయ్ వెళ్లనున్నారు. 120 ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్‌కు విజయ్ అందజేయనున్నారు. లేఖను పరిశీలించిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ ఆహ్వానించే అవకాశం ఉంది. ఈ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ పిలుపు కోసం టీవీకే అభిమానులు, పార్టీ నేతలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.