Tamil Nadu: గవర్నర్ పచ్చజెండా.. రేపు మ.3:15కి సీఎంగా విజయ్ ప్రమాణం
- తమిళనాడు గవర్నర్ పచ్చజెండా
- రేపు మ.3:15కి సీఎంగా విజయ్ ప్రమాణం
- చెన్నై నెహ్రూ స్టేడియంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు
- విజయ్‌తో పాటు 9 మంది మంత్రులు ప్రమాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హమ్మయ్య.. ఎట్టకేలకు తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ పచ్చజెండా ఊపారు. శనివారం సాయంత్రం 6:30 గంటలకు నాలుగో సారి గవర్నర్‌ను విజయ్ కలిశారు. మద్దతు తెలిపిన పార్టీలతో విజయ్ గవర్నర్‌ను కలిశారు. దాదాపు గంటన్నర పాటు సమావేశం జరిగింది. మద్దతు లేఖలను పరిశీలించిన తర్వాత గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 3:15 నిమిషాలకు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. విజయ్‌తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

Also Read
- Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.? రేపు మంత్రులతో ప్రధాని మోడీ భేటీ..
- New World Map: ‘తప్పుగా చూపితే అంగీకరించం’.. కొత్త ‘‘వరల్డ్ మ్యాప్’’పై భారత్ ఘాటు స్పష్టీకరణ
- PM Modi: ‘‘హోమియోపతి ఇచ్చా, దిమాగీ నక్సల్స్ బయటకు వస్తున్నారు’’.. మోడీ సంచలన వ్యాఖ్యలు..
- Delhi Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన 4 అంతస్తుల భవనం.. శిథిలాల కింద 50 మంది విద్యార్థులు..?
చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రమాణస్వీకారానికి పెద్ద ఎత్తున అభిమానులు, నాయకులు, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్త్ ఏర్పాటు చేయనున్నారు.

సోమవారం వెలువడిన ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే మాత్రమే 108 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. దీంతో విజయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించవచ్చని అంతా భావించారు. కానీ అందుకు భిన్నంగా అంచనాలు తారుమారయ్యాయి. పూర్తి మ్యాజిక్ ఫిగర్‌తో వస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తానని విజయ్‌కు సూచించారు. దీంతో కాంగ్రెస్, వామపక్షాల మద్దతు ఇవ్వడంతో విజయ్ బలం 116కు చేరింది. అయితే మరో రెండు స్థానాలు ఉన్న వీసీకేకు చెందిన పార్టీ మద్దతు ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తగ్గింది. దీంతో మ్యాజిక్ ఫిగర్‌కు విజయ్ చేరుకోకపోవడంతో రాజకీయ అనిశ్చితి అలానే కొనసాగుతోంది. మొత్తానికి శనివారం వీసీకే సంపూర్ణ మద్దతు ప్రకటించింది. వీసీకేతో పాటు ముస్లిం లీగ్ పార్టీ కూడా మద్దతు తెలిపింది. దీంతో విజయ్ బలం 120కి చేరింది.
తాజావార్తలు
-
Tata Tigor Facelift: టియాగోను మర్చిపోయేలా కొత్త టిగోర్.. ఫేస్‌లిఫ్ట్‌లో అదిరిపోయే మార్పులు
-
Madhuri Rathod : మాధురి రాథోడ్ ఆత్మహత్యాయత్నం.. ఈశ్వర్ సాయిపై సంచలన ఆరోపణలు
-
Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.? రేపు మంత్రులతో ప్రధాని మోడీ భేటీ..
-
New World Map: ‘తప్పుగా చూపితే అంగీకరించం’.. కొత్త ‘‘వరల్డ్ మ్యాప్’’పై భారత్ ఘాటు స్పష్టీకరణ
-
KCR : అసెంబ్లీలో కేసీఆర్ బిగ్ ప్లాన్.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు.!
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!