CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Vijay: డీలిమిటేషన్ వ్యవహారంపై దక్షిణాది రాష్ట్రాలు గగ్గోలు పెడుతూనే ఉన్నాయి.. ఎన్డీఏ పక్ష పాలిత రాష్ట్రాలు తప్ప.. మిగతా రాష్ట్రాలు మొత్తం.. ఈ వ్యవహారాన్ని తప్పుబడుతున్నాయి.. అయితే, డీలిమిటేషన్ అంశంపై తమిళనాడు సీఎం విజయ్ అసెంబ్లీలో కీలక తీర్మానం ప్రవేశపెట్టారు. లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543గానే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 2026 జనాభా లెక్కల ఆధారంగా వెంటనే డీలిమిటేషన్ చేపట్టవద్దని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేయొద్దు
డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ అన్యాయం జరగకుండా చూడాలని సీఎం విజయ్ కేంద్రాన్ని కోరారు. ముఖ్యంగా జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు డీలిమిటేషన్ వల్ల నష్టం కలగకూడదని స్పష్టం చేశారు. తమిళనాడు రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడటంతో పాటు రాష్ట్రాల హక్కులు, సమాఖ్య స్ఫూర్తిని పరిరక్షించాల్సిన అవసరం ఉందన్నారు. తమిళనాడు ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటిపైకి రావాలని విజయ్ పిలుపునిచ్చారు. డీలిమిటేషన్ అంశాన్ని వచ్చే ఎన్నికల రాజకీయాలతోనూ ముడిపెట్టిన ఆయన.. రాష్ట్ర హక్కుల విషయంలో అన్ని పార్టీలు కలసి పనిచేయాలని కోరారు.
Also Read
- Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
మహిళా రిజర్వేషన్‌పై కూడా కీలక డిమాండ్లు
మరోవైపు, మహిళా రిజర్వేషన్ అంశంపై కూడా సీఎం విజయ్ అసెంబ్లీలో తన వైఖరిని స్పష్టం చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను వెంటనే అమలు చేయాలని కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల్లోనే మహిళా రిజర్వేషన్ కల్పించాలని, 2029 లోక్‌సభ ఎన్నికల నుంచే 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్ పూర్తయ్యే వరకు మహిళా రిజర్వేషన్‌ను వాయిదా వేయకూడదని విజయ్ స్పష్టం చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్‌ను రెండు వేర్వేరు అంశాలుగా చూడాలని ఆయన స్పష్టం చేశారు.
డీఎంకే, అన్నాడీఎంకే వైఖరి ఏమిటి?
డీలిమిటేషన్ విషయంలో డీఎంకే వైఖరి కూడా తమిళనాడు ప్రయోజనాల పరిరక్షణ వైపే ఉంది. తమిళనాడు లోక్‌సభ ప్రాతినిధ్యం తగ్గకూడదన్న అభిప్రాయాన్ని ఆ పార్టీ వ్యక్తం చేస్తోంది. అన్నాడీఎంకే కూడా డీలిమిటేషన్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే సీఎం విజయ్ నిర్వహించిన ఎంపీల సమావేశానికి డీఎంకే, అన్నాడీఎంకే దూరంగా ఉన్నాయి. ఎంపీలతో మాత్రమే సమావేశం నిర్వహించకుండా అన్ని రాజకీయ పార్టీల అధినేతలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే డిమాండ్ చేసింది.
తమిళనాడు హక్కుల కోసం ఐక్యతకు పిలుపు
డీలిమిటేషన్ అంశంపై రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ, తమిళనాడు హక్కులు, రాజకీయ ప్రాతినిధ్యాన్ని కాపాడే విషయంలో అన్ని పార్టీలు ఒక్కతాటిపైకి రావాలని సీఎం విజయ్ కోరారు. జనాభా నియంత్రణలో ముందున్న రాష్ట్రాలకు శిక్ష పడేలా డీలిమిటేషన్ ఉండకూడదని అన్నారు. అదే సమయంలో మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో ముడిపెట్టి వాయిదా వేయడం సరికాదని విజయ్ స్పష్టం చేశారు. 543 లోక్‌సభ స్థానాల ప్రాతిపదికన మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ను 2029 నుంచే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్‌పై ఏకాభిప్రాయం సాధించి తమిళనాడు ప్రయోజనాలను కాపాడేందుకు అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!