Site icon NTV Telugu

Train Tickets Hike: ప్రధాని మోడీకి సీఎం స్టాలిన్ లేఖ.. రైలు టిక్కెట్‌ ధరలు పెంచొద్దని వినతి!

Stalin

Stalin

Train Tickets Hike: ట్రైన్ టిక్కెట్‌ ధరలు జూలై 1వ తేదీ నుంచి స్వల్పంగా పెంచేందుకు కేంద్ర రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఆయన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశారు. ఈ అంశంపై గురువారం (జూన్ 26న) ఒక ప్రకటన రిలీజ్ చేశారు. భారతీయ రైల్వే అనేది పేద, మధ్య తరగతి ప్రజలకు కేవలం ఒక ప్రయాణ సౌకర్యం మాత్రమే కాదు.. వారి జీవితాల్లో ఒక అంతర్భాగమని తెలిపారు. అయితే, నేను చెన్నై నుంచి కాట్పాడికి రైలులో ప్రయాణించగా, కాట్పాడి ప్రజలు స్వాగతం పలకడం ఆనవాయితీగా వస్తుంది.. కానీ ఈసారి వారిలో అంత ఉత్సాహం కనిపించలేదని స్టాలిన్ అన్నారు.

Read Also: Telangana : ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట.. రూ.180 కోట్లు మెడికల్ బిల్లులు విడుదల

అయితే, దీనికి ప్రధాన కారణం ఏంటా అని ఆరా తీయగా వచ్చే నెల నుంచి రైల్వే చార్జీలు పెంచబోతున్నారు అనే విషయం అక్కడి వారిని తీవ్రంగా కలచి వేస్తుందనే విషయాన్ని గ్రహించాను అని సీఎం స్టాలిన్ తెలిపారు. ఈ సందర్భంగా పేద, మధ్యతరగతి ప్రజలపై రైలు చార్జీలను పెంచి ప్రయాణ భారాన్ని మోపొద్దని ప్రధాని మోడీ, కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్‌లకు ప్రజల తరపున విఙ్ఞప్తి చేస్తున్నట్టు ఆ లేఖలో ఎంకే స్టాలిన్ వెల్లడించారు.

Exit mobile version