NTV Telugu Site icon

Delhi: ప్రధాని మోడీ, సోనియాతో సీఎం స్టాలిన్ భేటీ.. టూర్ విశేషాలు ఇవే!

Pmmodi

Pmmodi

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ దేశ రాజధాని ఢిల్లీలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. తమిళనాడు మెట్రో ప్రాజెక్ట్‌లకు అందించాల్సిన నిధులు ఇవ్వాలని కోరారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు నిధులు విడుదల చేశారని.. తమిళనాడు నిధులు కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే మెట్రో రెండో దశకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ వాటాను కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఎన్‌‌ఈపీని అమలు చేయకపోవడంతో ప్రస్తుతం నిలిపివేసిన సమగ్ర శిక్షా నిధులను కూడా విడుదల చేయాలని కోరారు. ప్రజల అభీష్టం మేరకు తమిళనాడు చాలా కాలంగా రెండు భాషల విధానాన్ని సమర్థిస్తోందని స్పష్టం చేశారు. తమిళనాడు మత్స్యకారులను శ్రీలంక నావికాదళం పదే పదే అరెస్టు చేయడంపై తక్షణ జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ప్రధాని మోడీని కలిసిన తర్వాత స్టాలిన్‌ ఎక్స్ ట్విట్టర్‌లో తెలియజేశారు.

ఢిల్లీ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీని కూడా సీఎం స్టాలిన్ కలిశారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. స్టాలిన్ వెంట కనిమొళి, డీఎంకే సీనియర్ నేతలు ఉన్నారు.

ఇది కూడా చదవండి: J-K: జమ్మూకశ్మీర్‌ ఎన్నికల వేళ పీఓకేలో ఉగ్రవాదుల మకాం.. దాడికి పెద్ద ఎత్తున ప్లాన్