NTV Telugu Site icon

MK stalin: మమతకు మద్దతుగా స్టాలిన్.. నీతి ఆయోగ్‌లో మైక్ కట్ చేయడంపై ధ్వజం

Mkstalin

Mkstalin

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి  తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ మద్దతుగా నిలిచారు. శనివారం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం మమత ప్రసంగిస్తుండగా మైక్ కట్ అయింది. దీంతో ఆమె సమావేశాన్ని వాకౌట్ చేసి బయటకు వచ్చేశారు. మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర సమస్యలపై మాట్లాడుతుండగా మైక్ కట్ చేశారని ఆరోపించారు. ఎన్డీయేతర ముఖ్యమంత్రుల్లో తానొక్కదాన్నే హాజరైతే.. కనీసం తనకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదని ధ్వజమెత్తారు.

ఇది కూడా చదవండి: Godavari-Sabari: కూనవరం సంగమం వద్ద ఉధృతంగా శబరి-గోదావరి నదులు

మమతకు తమిళనాడు సీఎం స్టాలిన్‌ మద్దతు నిలుస్తూ.. ఇదేనా సమాఖ్యవాదమంటే అని నిలదీశారు. ముఖ్యమంత్రి పట్ల వ్యవహరించే తీరు ఇదేనా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రజాస్వామ్యంలో అంతర్భాగమని చెప్పారు. శత్రువులుగా సంకీర్ణ ప్రభుత్వ భావించరాదని తెలిపారు. మమత మైక్‌ కట్‌ చేయడం కో ఆపరేటివ్‌ ఫెడరలిజమా? అని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: Paris Olympics 2024: పారిస్ లో మెగా ఫ్యామిలీ సందడి..సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్..

ఈ మేరకు ఆయన శనివారం ఎక్స్‌(ట్విటర్‌)లో ఒక పోస్టు చేశారు. ఒక ముఖ్యమంత్రిని ఇలాగేనా గౌరవించేంది.. ప్రతిపక్షాలు కూడా ప్రజాస్వామ్యంలో భాగమేనని బీజేపీ గుర్తించాలని హితవు పలికారు. వారిని శత్రువులుగా చూడకూడదన్నారు. కోఆపరేటివ్‌ ఫెడరలిజం మనుగడ సాగించాలంటే చర్చలకు అవకాశం ఉండాలని సూచించారు. భిన్నాభిప్రాయాలను గౌరవించాలని స్టాలిన్‌ తన పోస్టులో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Sidhu Jonnalagadda : అప్పుడు కనీకనిపించని పాత్ర.. ఇప్పుడేమో అతిధి పాత్ర!

ఇదిలా ఉంటే మమత వ్యాఖ్యలను కేంద్ర పెద్దలు తోసిపుచ్చారు. లంచ్ సమయం కావడంతో మైక్ కట్ చేశారని.. అనంతరం తిరిగి మమతకు సమయం ఉంటుందని చెప్పారు. అంతేతప్ప.. ఇందులో ఎలాంటి ఉద్దేశం లేదని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ సమావేశానికి ఎన్డీఏ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ హాజరుకాకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది.