Tamil Nadu: దేవాలయ నిధులు దేవాలయాలకే.. విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం..
- దేవాలయ నిధుల విషయంలో సీఎం విజయ్ సర్కార్ కీలక నిర్ణయం..
- మ్యారేజ్ హాళ్లు, కమర్షియల్ భవనాల నిర్మాణాలు రద్దు..
- గతంలో డీఎంకే ప్రభుత్వ సమయంలో రూ. 245తో ప్రాజెక్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamil Nadu: తమిళనాడులోని విజయ్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం దేవాలయ నిధుల వినియోగంపై కీలక చర్యను ప్రారంభించింది. హిందూ రిలిజియస్ అండ్ చారిటబుల్ ఎండోమెంట్స్ శాఖ పరిధిలోని దేవాలయ నిధులతో చేపట్టాలని భావించిన రూ. 245.85 కోట్ల విలువైన 46 ప్రాజెక్టులకు ఇచ్చిన పరిపాలన అనుమతుల్ని రద్దు చేసింది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 29 కళ్యాణ మండపాలను రూ. 115 కోట్లతో, 17 కమర్షియల్ సముదాయాలను రూ. 130 కోట్లతో నిర్మించాలనే ప్లాన్ నిలిచిపోయింది.
ప్రాజెక్టులు కొన్ని న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకోవడం, దేవాలయాలపై ఆర్థిక భారం పెరగడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. దేవాలయ నిధుల్ని వాణిజ్య కార్యకలాపాల కన్నా ఆలయ అభివృద్ధి, భక్తుల సంక్షేహం, వారసత్వ పరిరక్షణ వంటి కార్యక్రమాలకు వినియోగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. దేవాలయ నిధులతో భక్తులకు, దేవాలయాలకు ప్రయోజనం చేకూరే కొత్త పథకాలు ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు వెల్లడించారు.
Also Read
- West Bengal Hotel Fire: బీర్భూమ్లో ఘోర అగ్నిప్రమాదం.. హోటల్లో ఏడుగురు సజీవ దహనం
- Bihar Temple Stampede: బిహార్ ఆలయంలో విషాదం.. అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట, ఏడుగురు భక్తులు మృతి
- TVK Vijay Government: విజయ్ ప్రభుత్వానికి 100 రోజులు.. “డమ్మీ సీఎం” అంటూ విమర్శలు..!
- IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
గతంలో డీఎంకే ప్రభుత్వం దేవాలయ నిధులతో ఈ ప్రాజెక్టుల్ని చేపట్టింది. అయితే, ఈ నిర్ణయంపై రాజకీయంగా విమర్శలు వచ్చాయి. దేవాలయ ఆదాయాన్ని పెంచడంతో పాటు భక్తులకు తక్కువ ఖర్చుతో వివాహ వేదికలు అందించేందుకు ఈ ప్రాజెక్టులు చేపట్టినట్లు గతంలో డీఎంకే పేర్కొంది. తాజాగా విజయ్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై డీఎంకే తీవ్ర విమర్శలు చేస్తోంది. బీజేపీ డిమాండ్లకు అనుగుణంగా అధికార టీవీకే ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇదిలా ఉంటే, ప్రజలు దేవాలయ నిధుల్ని దేశాలయాలకే వినియోగించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు.
తాజావార్తలు
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
AP Rain Alert: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన!
-
Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
-
Dharani I Love You: సెంటిమెంట్ పాటను ఆలపించిన పట్నాయక్.. సినిమాకు ప్రత్యేక ఆకర్షణ!
-
Khalifa Trailer: ‘ఖలీఫా’ ట్రైలర్ ఔట్.. బంగారం, స్మగ్లింగ్, ప్రతీకారంతో పృథ్వీరాజ్ మాస్ వార్!
ట్రెండింగ్
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!
-
iQOO 16లో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. 165Hz డిస్ప్లే, 8,500mAh బ్యాటరీ, కొత్త కెమెరా డిజైన్ తో..
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!