Ammonia Gas Leak : తమిళనాడులో ఘోరం.. అమ్మోనియా లీక్.. 7 మంది మృతి.!

  • సీఫుడ్ యూనిట్‌లో అమ్మోనియా గ్యాస్ లీక్
  • ఏడుగురు కార్మికులు మృతి
  • 67 మందికి అస్వస్థత.. ఆస్పత్రులకు తరలింపు
  • ప్రమాదంపై అధికారులు విచారణ
Ammonia Gas Leak

Ammonia Gas Leak

Ammonia Gas Leak : తమిళనాడులో శనివారం రాత్రి ఒక విచారకరమైన ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లాలోని ఒక సీఫుడ్ (సముద్ర ఆహార) ప్రాసెసింగ్ యూనిట్‌లో అకస్మాత్తుగా అమ్మోనియా గ్యాస్ లీక్ కావడంతో ఏడుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. గ్యాస్ వేగంగా వ్యాపించడంతో ఫ్యాక్టరీలో పని చేస్తున్న సుమారు 67 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ స్పృహతప్పిన బాధితులను అక్కడున్న సిబ్బంది, స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని స్థానిక వైద్య కేంద్రాలకు తరలించారు.

ఈ ప్రమాదంపై తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ ఎస్. కవిత స్పందిస్తూ, అస్వస్థతకు గురైన వారందరికీ తక్షణ వైద్య సాయం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బాధితుల్లో 46 మంది వేల్స్ హాస్పిటల్‌లో, మరో 21 మంది వెంకటేశ్వర హాస్పిటల్‌లో అత్యవసర చికిత్స పొందుతున్నారని ఆమె పేర్కొన్నారు. అయితే, వీరిలో తొమ్మిది మంది పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో, వారిని మెరుగైన వైద్యం కోసం ప్రత్యేక అంబులెన్స్‌ల ద్వారా చెన్నైలోని ప్రభుత్వ స్టాన్లీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.

×
×
Ad