India – Bangladesh: బంగ్లాదేశ్‌లో మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. హిందువులు, మైనారిటీలే లక్ష్యంగా రాడికల్ ముస్లింగుంపు దాడులకు తెగబడుతోంది. ఎప్పుడైతే షేక్ హసీనా దిగిపోయి, మహ్మద్ యూనస్ ప్రభుత్వం ఏర్పడిందో అప్పటి నుంచి అక్కడ హిందువులకు రక్షణ లేకుండా పోయింది. సత్ఖిరాలోని జోషోశ్వరి ఆలయంలో ఉన్న హిందూదేవత వెంటి, బంగారు విగ్రహాం చోరీకి గురైంది. 2021లో ప్రధానిమోడీ బంగ్లాదేశ్ పర్యటనలో దీనిని బహూకరించారు. దీంతో పాటు పలు ప్రాంతాల్లో దుర్గాపూజ మండపాల వద్ద దాడులు జరిగాయి.
బంగ్లాదేశ్ వ్యాప్తంగా హిందువులు, హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడులపై భారత విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘ఢాకాలోని ఢాకాలోని తాంతిబజార్‌లోని పూజా మండపంపై దాడి, సత్ఖిరాలోని పూజ్యమైన జెషోరేశ్వరి కాళీ ఆలయంలో చోరీని మేము తీవ్ర ఆందోళనతో గుర్తించాము. ఇవి శోచనీయమైన సంఘటనలు. అవి క్రమబద్ధమైన పద్ధతిన చాలా రోజులుగా హిందూ ఆలయాలు, దేవతలను అపవిత్రం చేస్తున్నారు’’ అని ఒక ప్రకటనలో పేర్కొంది.
Read Also: Bangladesh: బంగ్లాదేశ్‌లో మోడీ దుర్గామాతకు బహూకరించిన కిరీటం చోరీ.. భారత్ సీరియస్
పండగ సమయంలో హిందువులు, మైనారిటీలకు వారి ప్రార్థనా స్థలాలకు భద్రతను పెంచాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. భారతదేశంతో పాటు పొరుగుదేశాల్లో విస్తరించి ఉన్న 51 శక్తి పీఠాల్లో జెషోశ్వరి ఆలయం ఒకటిగా పరిగణించబడుతుంది. శుక్రవారం ఢాకాలోని తాంతిబజార్ ప్రాంతంలో దుర్గాపూజా మండపంపై పెట్రోల్ బాంబు దాడులు జరిగాయి. ఈ దాడిలో కనీసం 20 మంది గాయపడ్డారు.
17 కోట్ల బంగ్లాదేశ్ జనాభాలో హిందువులు 8 శాతం ఉన్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆగస్టులో జరిగిన హింసాత్మక నిరసనల తర్వాత బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేశారు. ఆ తర్వాత మహ్మద్ యూనస్ ఆధ్వర్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి హిందూ సమాజం బెదిరింపులను ఎదుర్కొంటోంది. మెజారిటీ ముస్లింల మనోభావాలను విరుద్ధంగా దుర్గాపూజను హిందువులు నిర్వహించొద్దని అక్కడి ఇస్లామిస్ట్ గ్రూపులు బెదిరింపులకు పాల్పడుతున్నాయి. అక్టోబర్ 1 నుంచి దుర్గాపూజకు సంబంధించి ఆ దేశ వ్యాప్తంగా 35 సంఘటనలు జరిగాయి.