Site icon NTV Telugu

Suvendu Adhikari: బీజేపీ గెలిచిన తర్వాత ముస్లిం ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బహిష్కరిస్తాం..

Suvendu Adhikari

Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ సమావేశాలు రసాభాసగా మారాయి. ప్రతిపక్ష బీజేపీ నేతలు వాకౌట్ చేశారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో దేవాలయాలపై జరుగుతున్న దాడుల గురించి, సభను వాయిదా వేయాలనే ప్రతిపాదనను స్పీకర్ తిరస్కరించారు. బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేస్తూ, పత్రాలను చింపేశారు. బీజేపీ సభ్యులకు ఎలాంటి పత్రాలు అందించొద్దని స్పీకర్ బిమన్ బంద్యోపాధ్యాయ కార్యదర్శిని ఆదేశించారు. బాలల హక్కుల పరిరక్షణకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టాలన బీజేపీ ఎమ్మెల్యేల ప్రతిపాదనను స్పీకర్ తిరస్కరించారు.

అయితే, ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ ఎమ్మెల్యే సువేందు అధికారి ఈ చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంలో అత్యంత అరుదైన సంఘటనగా అభివర్ణించారు.”శాసనసభ లోపల కూడా ప్రజాస్వామ్యం లేదు. ప్రతిపక్షం వినిపించుకోవడం లేదు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతంగా ప్రతిదీ చేయడానికి ప్రయత్నిస్తోంది. దీనికి నిరసనగా బిజెపి ఎమ్మెల్యేలు వాకౌట్ కూడా చేశారు” అని చెప్పారు.

Read Also: Holi: సంభాల్ జామా మసీదులో పాటు 10 మసీదులకు ముసుగు..

“గత నాలుగైదు రోజుల్లో, తమ్లుక్ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో హిందూ దేవాలయాలపై దాడులు, విగ్రహాలను ధ్వంసం చేసి, నిప్పంటించిన సంఘటనలు జరిగాయి. ఒక్క అరెస్టు కూడా జరగలేదు. ముర్షిదాబాద్ జిల్లా నవాడా, ఉలుబేరియాలో హిందువులపై దాడి చేశారు. హిందూ దుకాణాల యజమానులు, ఇళ్లకు నిప్పంటించి దోచుకున్నారు” అని సువేందు అధికారి ఆరోపించారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలిచినందుకు సంబరాలు చేసుకుంటున్న వారిపై ఉలుబేరియాలో దాడి జరిగినట్లు సువేందు పేర్కొన్నారు.

మరోవైపు మార్చి 14న శుక్రవారం కావడంతో, హోలీ వేడుకలు ఉదయం 11 గంటల్లోపే ముగించాలని పోలీసులు కోరారని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ‘‘ముస్లింలీగ్-2’’గా, పోలీసుల్ని మతతత్వవాదులుగా ఆయన ఆరోపించారు. బీర్భూమ్ జిల్లా అదనపు ఎస్పీ శాంతినికేతన్‌లో బసంత ఉత్సవాలను ఉదయం 11 గంటలకు ముగించాలని కోరుతున్నారని ఆరోపించారు.

హిందువులు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)ని అధికారం నుంచి దించేస్తానరి సువేందు అధికారి అన్నారు. “మేము స్పీకర్ బిమన్ బెనర్జీని మరియు ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఓడిస్తాము. బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత, వారి (టిఎంసి) పార్టీకి చెందిన ముస్లిం ఎమ్మెల్యేలను 10 నెలల్లో వారిని సభ నుండి వెళ్ళగొడతారు” అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Exit mobile version