Suvendu Adhikari: ‘‘దేవుడు మాతో ఉన్నారు, సనాతన ధర్మ ప్రయోజనాలు రక్షించే ప్రభుత్వం వస్తుంది’’ అని బీజేపీ నాయకుడు సువేందు అధికారి అన్నారు. ఓట్ల లెక్కింపునకు ముందు ఆయన కోల్‌కతాలోని లక్ష్మీనారాయణ ఆలయంలో ప్రార్థనలు చేశారు. ఫల్తా నియోజకవర్గంలో ఈసీ రీ పోలింగ్‌కు ఆదేశించడంపై టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ చేసిన ట్వీట్ పై స్పందిస్తూ.. ఇది ఆయన అహంకారాన్ని చూపిస్తోందని, దేశంలో అంతిమంగా ప్రజాస్వామ్యం గెలుస్తుందని, ఇలాంటి పరిస్థితులే యూపీలో ఉండేవని, బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జంగిల్ రాజ్ అంతమైందని ఆయన అన్నారు.
సువేందు అధికారి ఈ ఎన్నికల్లో కూడా మమతా బెనర్జీకి పోటీగా నిల్చుకున్నారు. రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తు్న్న భవానీపూర్ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీకి పోటీగా నిల్చున్నారు. ఇదే సమయంలో నందిగ్రామ్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. 2021 ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీని ఓడించారు. 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న బెంగాల్‌లో సోమవారం 293 అసెంబ్లీకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఫల్తా నియోజకవర్గంలో అక్రమాలు జరగడంతో రీపోలింగ్‌కు ఈసీ ఆదేశించింది. రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది.
#WATCH | Kolkata | West Bengal LoP and BJP candidate from Nandigram and Bhabanipur, Suvendu Adhikari, says, "… I offered prayers at the Lakshmi Narayan Temple. God is with us. A government that protects the interests of Sanatan Dharma is coming."
On TMC National General… pic.twitter.com/UyJqDOcHn0
— ANI (@ANI) May 4, 2026
