NTV Telugu Site icon

Puja Khedkar: పూజా ఖేద్కర్ వైకల్యం సర్టిఫికేట్ నకిలీదే.. హైకోర్టుకు పోలీసుల రిపోర్టు

Pujakhedkar

Pujakhedkar

మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ యూపీఎస్సీకి సమర్పించిన దివ్యాంగ సర్టిఫికేట్ నకిలీదేనని పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు ఇచ్చిన స్టేటస్ రిపోర్టులో పేర్కొన్నారు. పూజా ఖేద్కర్ తన పేరును సర్టిఫికేట్‌లో మార్చుకుని మూడు వేర్వేరు పేర్లు ఉపయోగించి 12 సార్లు సివిల్స్ పరీక్షలు రాసినట్లుగా పోలీసులు తెలిపారు. శారీరక, మానసిక వైకల్యాల గురించి పూజా ఖేద్కర్ అబద్ధాలు చెప్పారని, అలాగే పరీక్షలో ఉత్తీర్ణత సాధించేందుకు ఓబీసీ సర్టిఫికేట్‌ను కూడా ఫోర్జరీ చేశారని పూజా ఖేద్కర్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే యూపీఎస్సీ ఆమె సర్వీస్‌ను రద్దు చేసింది. భవిష్యత్‌లో ఏ పరీక్షల్లో పాల్గొనకుండా వేటు వేసింది.

ఇది కూడా చదవండి: Bhopal: ధూమ్ 2 సినిమా తరహాలో చోరీకి ప్లాన్.. బెడిసికొట్టి చివరికిలా..!

2018-2021 నుంచి, 2022-2023లో యూపీఎస్సీ పరీక్షల కోసం అహ్మద్‌నగర్ జిల్లా సివిల్ హాస్పిటల్ ద్వారా నకిలీ సర్టిఫికేట్లు పొందినట్లుగా సమాచారం. UPSC పరీక్షలో అదనపు ప్రయత్నాలను పొందేందుకు తన పేరును మార్చడమే కాకుండా ఆమె తల్లిదండ్రుల వైవాహిక స్థితి గురించి కూడా తప్పుడు సమాచారం అందించినట్లుగా కనుగొన్నారు. పూజా ఖేద్కర్ మోసానికి పాల్పడ్డారని ఢిల్లీ పోలీసులు హైకోర్టుకు సమర్పించిన మొదటి నివేదికలో వెల్లడించారు. ఈ ఘటనలో ఇతరుల ప్రమేయం కూడా ఉండొచ్చని అభిప్రాయపడింది.

ఇది కూడా చదవండి: Vijayawada Floods: వరద బాధితుల వద్ద డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు..

జూలై 31న పూజా ఖేద్కర్ తాత్కాలిక అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ రద్దు చేసింది. భవిష్యత్తులో ఎలాంటి పరీక్షలు లేదా ఎంపికలకు హాజరుకాకుండా ఆమెను నిషేధించింది. అంతేకాకుండా ఢిల్లీలో పూజా ఖేద్కర్‌పై మోసం, ఫోర్జరీకి సంబంధించి క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసులో న్యాయస్థానం ఊరటనిచ్చింది. అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది.

ఇది కూడా చదవండి: IC-814 Plane Hijack: భారతీయ మహిళకు శాలువాపై పుట్టినరోజు శుభాకాంక్షలు రాసిచ్చిన ఉగ్రవాది!.. అది ఇంకా ఆమెతోనే ఉంది

Show comments