Bengaluru Blast: గత వారం జరిగిన బెంగళూర్ రామేశ్వరం కేఫ్ పేలుడు విచారణ వేగవంతమైంది. నిందితుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాడనే విషయాలను పోలీసులు ట్రాక్ చేస్తున్నారు. ఈ కేసులో మంచి సమాచారం లభించిందని కర్ణాటక రాష్ట్ర హోం మంత్రి జి పరమేశ్వర గురువారం తెలిపారు. పేలుడు జరిగిన తర్వా నిందితుడు తన దుస్తుల్ని మార్చుకుని తుమకూరు పట్టణం వైపు వెళ్లినట్లు తెలిసిందని, బళ్లారి వరకు అతని కదలికలను ట్రేస్ చేసినట్లు మంత్రి ధ్రువీకరించారు.
Read Also: Uttar Pradesh: అత్యాచార బాధితురాలి తండ్రి ఆత్మహత్య.. కేసు విత్‌డ్రా చేసుకోవాలని ఒత్తిడి..
బెంగళూర్ ఐటీ కారిడార్‌లోని బ్రూక్‌ఫీల్డ్‌లోని రామేశ్వర కేఫ్‌లో ఐఈడీ బాంబు పేలుడు జరిగింది. ఈ కేసును ఎన్ఐఏతో పాటు బెంగళూర్ పోలీస్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో నిందితుడి గురించి సమాచారం వచ్చినట్లు, త్వరలోనే అరెస్ట్ చేస్తామని పరమేశ్వర చెప్పారు. అనుమానితుడు బ్యాక్ ప్యాక్‌తో, ఫుల్ స్లీవ్ షర్ట్, క్యాప్, ఫేస్ మాస్స్, కళ్లద్దాలు ధరించి బస్సులో ఉన్న వీడియో ఫుటేజ్ బయటకు వచ్చింది. బస్సులోని కెమెరాకు చిక్కుకుండా నిందితుడు తనను కవర్ చేయని దిశలో ఉన్నట్లు వీడియోను బట్టి తెలుస్తోంది. బాంబు పేలుడు గురించి సమాచారం అందిస్తే రూ. 10 లక్షల నగదు బహుమతిని ఎన్ఐఏ ప్రకటించింది.