Bengaluru Cafe Blast: బెంగళూర్‌లో రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు నిందితుడి కొత్త ఫోటోలను కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విడుదల చేసింది. మార్చి 3న కేసును స్వాధీనం చేసుకున్న ఎన్ఐఏ, నిందితుడిని గుర్తించేందు ప్రజల సాయాన్ని కోరింది. మార్చి 1న బెంగళూర్‌లోని ఐటీ కారిడార్‌లోని కేఫ్‌లో నిందితుడు బ్యాగుల్లో ఐఈడీ బాంబును ఉంచి, టైమర్ సాయంతో పేల్చాడు. ఈ ఘటనలో 10 మంది గాయపడ్డారు. పేలుడు తర్వాత నిందితుడు బస్సు ఎక్కినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపించింది.
Bengaluru cafe blast: బెంగళూర్‌లో రామేశ్వరం కేఫ్ పేలుడు జరిగి వారం గడుస్తోంది. ఇప్పటికీ నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు సంస్థలు వేటను సాగిస్తూనే ఉన్నాయి. నిందితుడికి సంబంధించిన పలు వీడియోలు బయటకు వచ్చాయి. వీటి ఆధారంగా కర్ణాటక పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) దర్యాప్తు చేస్తోంది. ఇదిలా ఉంటే నిందితుడికి సంబంధించిన తాజా వీడియో ఒకటి బయటకు వచ్చింది. ముసుగు దరించి బూడిద రంగు చొక్క ధరించినట్లు ఈ వీడియోలో చూడవచ్చు.
Bengaluru Blast: గత వారం జరిగిన బెంగళూర్ రామేశ్వరం కేఫ్ పేలుడు విచారణ వేగవంతమైంది. నిందితుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాడనే విషయాలను పోలీసులు ట్రాక్ చేస్తున్నారు. ఈ కేసులో మంచి సమాచారం లభించిందని కర్ణాటక రాష్ట్ర హోం మంత్రి జి పరమేశ్వర గురువారం తెలిపారు. పేలుడు జరిగిన తర్వా నిందితుడు తన దుస్తుల్ని మార్చుకుని తుమకూరు పట్టణం వైపు వెళ్లినట్లు తెలిసిందని, బళ్లారి వరకు అతని కదలికలను ట్రేస్ చేసినట్లు మంత్రి ధ్రువీకరించారు.
Rameshwaram Cafe Blast: బెంగళూర్ నగరంలో రామేశ్వరం కేఫ్ పేలుడు దేశంలో సంచలనంగా మారింది. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన పేలుడులో 10 మంది గాయపడ్డారు. నిందితుడు టిఫిన్ చేసేందుకు వచ్చాడనే ముసుగులో బాంబు ఉన్న బ్యాగ్‌ని అక్కడే వదిలేసి వెళ్లాడు. టైమర్ సహాయంతో బాంబు పేల్చినట్లు ప్రాథమికంగా తెలిసింది. ఈ కేసులో తక్కువ తీవ్రత ఉన్న ఐఈడీ బాంబును వాడినట్లు తేలింది. ఈ కేసును బెంగళూర్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం…