NTV Telugu Site icon

PM Modi: సర్జికల్ స్ట్రైక్స్‌తో ఉగ్రవాదానికి బుద్ధి చెప్పాం

Pmmodi

Pmmodi

ఉగ్రవాదం మార్గదర్శకులకు సర్జికల్ స్ట్రైక్స్‌తో బుద్ధి చెప్పామని ప్రధాని మోడీ అన్నారు. జమ్మూకాశ్మీర్‌లో మూడో విడతలో జరిగే నియోజకవర్గాల్లో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సర్జికల్ స్టైక్స్‌తో శత్రుదేశాలకు భయం పుట్టించామని.. మళ్లీ ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే దెబ్బలు తగులుతాయని అర్థం చేసుకున్నారని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. 2016లో సర్జికల్ స్ట్రైక్‌తో శత్రు భూభాగంలో దాడి చేయగల కొత్త భారత్‌ను ప్రపంచానికి చాటి చెప్పిందని ప్రధాని ప్రధాని శనివారం అన్నారు.

ఇది కూడా చదవండి: IAS officer’s wife’s rape: “ఐఏఎస్ అధికారి భార్యపై అత్యాచారం”.. పోలీసులపై చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశం..

2016, సెప్టెంబర్ 18న జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా సర్జికల్ స్టైక్స్ జరిగినట్లు గుర్తుచేవారు. ఈ చర్యతో శత్రు దేశం భయపడిందన్నారు. ఏదైనా తీవ్రమైన పని చేస్తే.. భారత్‌ దెబ్బ తట్టుకోలేమని శత్రు దేశం భావించిందని తెలిపారు. సర్జికల్ స్ట్రైక్స్‌ జరిగినట్లుగా రుజువు కావాలని కోరినందుకు కాంగ్రెస్‌ను ప్రజలు ఎప్పటికీ క్షమించలేరని ప్రధాని అన్నారు.

జమ్మూకాశ్మీర్ ప్రజలు ఎన్‌సీ, పీడీపీ, కాంగ్రెస్ కుటుంబాలతో విసిగిపోయారన్నారు. ఇక్కడ ప్రజలు అవినీతి పార్టీలను కోరుకోవని చెప్పారు. ప్రజలు శాంతిని కోరుకుంటున్నారన తెలిపారు. పిల్లల మంచి భవిష్యత్ కోసం బీజేపీని గెలిపించాలని కోరారు. రెండు దశల్లో జరిగిన పోలింగ్‌లో బీజేపీకే ఓటు వేశారన్నారు. భారీ మెజార్టీతో బీజేపీ గెలవబోతుందని స్పష్టం చేశారు. అక్టోబర్ 12 విజయదశమి ఘనంగా జరుపుకోవాలంటే బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జమ్మూ ప్రాంతంలోని ప్రజలపై ఉన్న చారిత్రక వివక్షను తొలగించేందుకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. బీజేపీ పాలనలో జమ్మూకాశ్మీర్ ఎంతగానో అభివృద్ధి చెందిందని వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Health: వేగంగా విస్తరిస్తున్న సమస్య.. ప్రతి 10 మందిలో ముగ్గురికి ఈ వ్యాధి

అక్టోబర్ 1న ఓటింగ్ జరగనున్న జమ్మూ, సాంబా, కథువా, ఉధంపూర్ జిల్లాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న 24 మంది బీజేపీ అభ్యర్థులు వేదికపై ఉన్నారు. జమ్మూకాశ్మీర్ అభివృద్ధి కోసం బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని మోడీ విజ్ఞప్తి చేశారు. జమ్మూ జిల్లాలో 11, కథువాలో 6, సాంబా 3, ఉధంపూర్‌లో 4 సీట్లు ఉన్నాయి. ఈ నియోజక వర్గాలకు మూడో దశలో ఓటింగ్ జరగనుంది. చివరి దశ అక్టోబర్ 1న జరగనుంది. కౌంటింగ్ అక్టోబర్ 8న జరగనుంది. జమ్మూకాశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Haryana polls: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. ప్రజలపై ఉచిత వరాల జల్లులు