NTV Telugu Site icon

Ram Mandir: అయోధ్య రామమందిర వేళ ఒక్కసారిగా కాషాయ జెండాలకు డిమాండ్..

Jai Sriram

Jai Sriram

Ram Mandir: అయోధ్యలో భవ్య రామమందిర వేడులకు ప్రారంభయ్యాయి. అయోధ్య, యూపీలతో పాటు దేశవ్యాప్తంగా రామ భక్తులు జనవరి 22 ఆలయ ప్రారంభోత్సవ అద్భుత ఘట్టం కోసం ఎదురుచూస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలు రామనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా, దేశవ్యాప్తంగా 7000 మందికి పైగా ప్రముఖులు హాజరవుతున్న ఈ కార్యక్రమానికి యూపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. రామ్ లల్లా ప్రాణప్రతిష్ట కోసం యావత్ దేశం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది.

Read Also: Congress: కాంగ్రెస్‌కి వ్యూహకర్తలు షాకిస్తున్నారా.. ప్రశాంత్ కిషోర్ తర్వాత సునీల్ కనుగోలు దూరం..?

ఇదిలా ఉంటే రామాలయ వేడక నేపథ్యంలో దేశవ్యాప్తంగా కాషాయ జెండాలకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది. రాముడు, హనుమాన్, రామాలయ చిత్రాలు కలిగిన కాషాయ జెండాలకు డిమాండ్ ఉంది. దేశవ్యాప్తంగా ఈ జెండాలు భక్తులు విరివిగా కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా అయోధ్య సమీప ప్రాంతాల్లో ఈ జెండాలకు విపరీతమైన డిమాండ్ ఉన్నట్లు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. 2019 సుప్రీంకోర్టు తీర్పు తర్వాత నుంచి కాషాయ జెండాలకు డిమాండ్ పెరుగుతున్నట్లు వారు తెలిపారు. గతంలో కొందరు మాత్రమే ఇంటిపై రాముడు, హనుమాన్ ఉన్న కాషాయ జెండాలను ఎగరేసే వారని, ప్రస్తుతం ప్రతీ ఇంటిపై ఈ జెండాలు దర్శనమిస్తున్నాయని చెబుతున్నారు. రామాలయ ప్రారంభోత్సవానికి మరో 10 రోజులు మాత్రమే ఉండటంతో పలు ప్రాంతాల్లో రోడ్లకు ఇరువైపులా జెండాలు ఏర్పాటు చేస్తున్నారు. సైజును బట్టి వీటి ధర రూ. 50 నుంచి రూ. 1000 వరకు ఉంటోంది. కొన్ని రోజులుగా శోభాయాత్రలు నిర్వహిస్తుండటం కూడా జెండాల డిమాండ్‌కి కారణమవుతోంది.