Ram Mandir: అయోధ్యలో భవ్య రామమందిర వేడులకు ప్రారంభయ్యాయి. అయోధ్య, యూపీలతో పాటు దేశవ్యాప్తంగా రామ భక్తులు జనవరి 22 ఆలయ ప్రారంభోత్సవ అద్భుత ఘట్టం కోసం ఎదురుచూస్తున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాలు రామనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా, దేశవ్యాప్తంగా 7000 మందికి పైగా ప్రముఖులు హాజరవుతున్న ఈ కార్యక్రమానికి యూపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేసింది. రామ్ లల్లా ప్రాణప్రతిష్ట కోసం యావత్ దేశం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది.