Kerala: నేనేం సీఎంని కాదు.. వృద్ధురాలితో కేంద్ర మంత్రి దురుసు ప్రవర్తన
- ఇంటి నిర్మాణం కోసం అభ్యర్థించిన ఓ వృద్ధుడితో దురుసుగా మాట్లాడిన కేంద్ర మంత్రి
- నేను దేశానికి మంత్రిని.. ఎక్కువగా మాట్లాడవద్దు అంటూ వృద్ధురాలిపై మండిపాటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంటి నిర్మాణం కోసం అభ్యర్థించిన ఓ వృద్ధుడితో దురుసుగా ప్రవర్తించారు కేంద్రం మంత్రి సురేష్ గోపి. తన నియోజకవర్గమైన త్రిశ్శూర్ పర్యటనలో ఓ వృద్ధ మహిళతో దురుసుగా మాట్లాడి మరో వివాదానికి ఆయన తెరలేపారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇంటి నిర్మాణం కోసం అభ్యర్థించిన ఓ వృద్ధుడి దరఖాస్తు తీసుకునేందుకు ఇటీవల తిరస్కరించిన మంత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. అమలు చేయలేని హామీలు తాను ఇవ్వబోనంటూ ఆ వైఖరిని సమర్థించుకున్నారు. త్రిశ్శూర్ పర్యటనలో ఓ వృద్ధ మహిళతో దురుసుగా మాట్లాడి మరో వివాదంలో చిక్కుకున్నారు.
సీపీఎం నేతల ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలున్న కరువన్నూర్ సహకార బ్యాంకు కుంభకోణంలో పలువురి డిపాజిట్లు ఆగి పోయాయి. దీనిపై ఈడీ దర్యాప్తు జరుగుతోంది. ఆనందవల్లి అనే మహిళ తన డిపాజిట్ సొమ్ము తిరిగి ఇప్పించడంలో సహకరించాలని కేంద్ర మంత్రి సురేష్ గోపిని కోరారు. వెళ్లి మీ మంత్రికో, ముఖ్యమంత్రికో చెప్పుకోమని.. అంతే కాకుండా తన ముందు ఎక్కువగా మాట్లాడవద్దు అంటూ దురుసుగా మాట్లాడారు. ‘మీరు కూడా మా మంత్రే కదా మహిళ అని చెప్పడంతో..నేను దేశానికి మంత్రిని అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన విధానం వైరల్ గా మారింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తమ డిపాజిట్లు వెనక్కు రప్పిస్తానని సురేశ్ గోపి హామీ ఇచ్చారని, ఆయన కటువుగా మాట్లాడకుండా తన అభ్యర్థనను పరిశీలిస్తానని చెప్పినా సరిపోయేదని ఆనందవల్లి మీడియాకు తెలిపారు.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!