Site icon NTV Telugu

Surat Video: 10వ అంతస్తు నుంచి జారిపడ్డ వ్యక్తి.. ప్రాణాలతో ఎలా బయటపడ్డాంటే..!

Surat Video

Surat Video

భూమ్మీద నూకలుంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా బయటపడతారని పెద్దలు అంటుంటారు. ఇలాంటి సంఘటనలు చాలా చూశాం. తాజాగా ఇలాంటి ఘటనే గుజరాత్‌లోని సూరత్‌లో చోటుచేసుకుంది. 10వ అంతస్తు నుంచి జారి పడ్డ ఒక వ్యక్తి.. సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. అసలేం జరిగింది.. ఎలా పడిపోయాడో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.

గురువారం సూరత్‌లోని జహంగీరాబాద్ ప్రాంతంలో ఉదయం 8గంటలకు నితిన్ ఆదియా అనే 57 ఏళ్ల వ్యక్తి 10వ అంతస్తు ఫ్లాట్ కిటికీ మీద కూర్చుని నిద్రపోతున్నాడు. కునుకు తీస్తుండగా ఒక్కసారిగా కింద పడిపోబోయాడు. అలా జరిపడుతున్న క్రమంలో 8వ అంతస్తులోని కిటికీ వెలుపల ఏర్పాటు చేసిన మెటల్ గ్రిల్‌లో కాలు ఇరుక్కుని విలవిలలాడాడు. అతడి అరుపులు విన్న నివాసితులు షాక్‌కు గురయ్యారు. భవనం వెలుపల నిస్సహాయంగా వేలాడుతున్న వ్యక్తిని చూసి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలో వచ్చిన సిబ్బంది జాగ్రత్తగా తాళ్లు, భద్రతా బెల్టులు ఉపయోగించి సురక్షితంగా రక్షించారు. దాదాపు గంటసేపు జరిగిన రెస్క్యూ ఆపరేషన్ తర్వాత క్షేమంగా బయటపడడంతో అపార్ట్‌మెంట్ వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ప్రస్తుతం ఆదియాను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్పృహలోనే ఉన్నాడని.. కాలు విరిగిందని వైద్యులు తెలిపారు.

 

Exit mobile version