Supreme Court: కృష్ణ జన్మభూమిలో అక్రమ కట్టడాల కూల్చివేతలపై సుప్రీం స్టే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: కృష్ణ జన్మభూమిలో అక్రమ కట్టడాల కూల్చివేతలపై సుప్రీం స్టే విధించింది. 10 రోజులపాటు ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని మధ్యంతర తీర్పు ఇచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథురలోని కృష్ణ జన్మభూమి వద్ద కొనసాగుతున్న నిర్మాణాల తొలగింపు ప్రక్రియకు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. నాయి బస్తీలో రైల్వేశాఖ నిర్వహిస్తున్న నిర్మాణాల తొలగింపును అడ్డుకోవాలంటూ బస్తీవాసులు సుప్రీంలో పిటిషను వేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ రోజు తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. 10 రోజుల పాటు నిర్మాణాల కూల్చివేతలను నిలిపివేయాలని ఆదేశించింది. 66 ఏళ్ల యాకుబ్ షా వేసిన పిటిషన్ ఆధారంగా కోర్టు ఈ తీర్పునిచ్చింది. నాయి బస్తీ ప్రాంతంలో తమ కుటుంబాలు 1880 నుంచి నివసిస్తున్నట్లు వారు పిటీషన్లో తెలిపారు. ఆగస్టు 9వ తేదీ నుంచి రైల్వేశాఖ అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ చేపట్టిన విషయం తెలిసిందే. విచారణ జరిపి సుప్రీంకోర్టు కేసును వచ్చే వారం వాయిదా వేసింది.
Read also: Eshanya Maheshwari Hot Pics: ఈశాన్య అందాల జాతర.. ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టిల్స్ అదుర్స్!
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
పది రోజుల పాటు ఎలాంటి కూల్చివేతలు చేపట్టకుండా రైల్వే శాఖను ఆదేశిస్తూ కేంద్రానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. వందేభారత్ లాంటి అధునాతన రైల్వేల రాకపోకలకు వీలుగా మథుర నుంచి బృందావన్ వరకు 21 కి.మీల స్ట్రెచ్‌ను నిర్మించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆగస్టు 9న కృష్ణ జన్మభూమి సమీపంలో ఉన్న అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం కృష్ణ జన్మభూమి వెనుకవైపు ఉన్న నాయి బస్తీలో ఇప్పటివరకు 135 ఇళ్లను కూల్చివేశారు. ఇదంతా కుట్రపూరితంగా చేస్తున్నారని ఆరోపించిన బస్తీవాసులు దీనిపై కోర్టును ఆశ్రయించారు. కూల్చివేతలకు వ్యతికేరంగా స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు. అయితే యూపీలో న్యాయవాదుల ఆందోళన కారణంగా ఈ పిటిషన్‌పై విచారణ జరగకపోవడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ ప్రాంతంలో సగానికి పైగా ఇళ్లను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం బస్తీవాసులకు తాత్కాలిక ఊరటనిస్తూ .. 10 రోజుల పాటు కూల్చివేతలు నిలిపివేయాలని ఆదేశాల్చింది. వచ్చే బుధవారం విచారణను కొనసాగించనున్నారు.
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!