NTV Telugu Site icon

Supreme Court: కృష్ణ జన్మభూమిలో అక్రమ కట్టడాల కూల్చివేతలపై సుప్రీం స్టే

Supreme Court

Supreme Court

Supreme Court: కృష్ణ జన్మభూమిలో అక్రమ కట్టడాల కూల్చివేతలపై సుప్రీం స్టే విధించింది. 10 రోజులపాటు ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని మధ్యంతర తీర్పు ఇచ్చింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మ‌థుర‌లోని కృష్ణ జ‌న్మభూమి వ‌ద్ద కొన‌సాగుతున్న నిర్మాణాల తొల‌గింపు ప్రక్రియ‌కు సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. నాయి బ‌స్తీలో రైల్వేశాఖ నిర్వహిస్తున్న నిర్మాణాల‌ తొల‌గింపును అడ్డుకోవాలంటూ బస్తీవాసులు సుప్రీంలో పిటిష‌ను వేశారు. పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ రోజు తాత్కాలిక ఆదేశాలు జారీ చేసింది. 10 రోజుల పాటు నిర్మాణాల కూల్చివేతలను నిలిపివేయాలని ఆదేశించింది. 66 ఏళ్ల యాకుబ్ షా వేసిన పిటిష‌న్ ఆధారంగా కోర్టు ఈ తీర్పునిచ్చింది. నాయి బ‌స్తీ ప్రాంతంలో త‌మ కుటుంబాలు 1880 నుంచి నివ‌సిస్తున్నట్లు వారు పిటీష‌న్‌లో తెలిపారు. ఆగ‌స్టు 9వ తేదీ నుంచి రైల్వేశాఖ అక్రమ నిర్మాణాల తొల‌గింపు ప్రక్రియ చేప‌ట్టిన విషయం తెలిసిందే. విచారణ జరిపి సుప్రీంకోర్టు కేసును వ‌చ్చే వారం వాయిదా వేసింది.

Read also: Eshanya Maheshwari Hot Pics: ఈశాన్య అందాల జాతర.. ఫ్రంట్ అండ్ బ్యాక్ స్టిల్స్‌ అదుర్స్!

పది రోజుల పాటు ఎలాంటి కూల్చివేతలు చేపట్టకుండా రైల్వే శాఖను ఆదేశిస్తూ కేంద్రానికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. వందేభారత్‌ లాంటి అధునాతన రైల్వేల రాకపోకలకు వీలుగా మథుర నుంచి బృందావన్‌ వరకు 21 కి.మీల స్ట్రెచ్‌ను నిర్మించాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే ఆగస్టు 9న కృష్ణ జన్మభూమి సమీపంలో ఉన్న అక్రమ కట్టడాల తొలగింపు ప్రక్రియ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం కృష్ణ జన్మభూమి వెనుకవైపు ఉన్న నాయి బస్తీలో ఇప్పటివరకు 135 ఇళ్లను కూల్చివేశారు. ఇదంతా కుట్రపూరితంగా చేస్తున్నారని ఆరోపించిన బస్తీవాసులు దీనిపై కోర్టును ఆశ్రయించారు. కూల్చివేతలకు వ్యతికేరంగా స్థానిక కోర్టులో పిటిషన్‌ వేశారు. అయితే యూపీలో న్యాయవాదుల ఆందోళన కారణంగా ఈ పిటిషన్‌పై విచారణ జరగకపోవడంతో వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తమ ప్రాంతంలో సగానికి పైగా ఇళ్లను కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం బస్తీవాసులకు తాత్కాలిక ఊరటనిస్తూ .. 10 రోజుల పాటు కూల్చివేతలు నిలిపివేయాలని ఆదేశాల్చింది. వచ్చే బుధవారం విచారణను కొనసాగించనున్నారు.