Supreme Court: మొబైల్ ఫోన్, మైక్ పట్టుకున్న ప్రతీ ఒక్కరూ జర్నలిస్ట్ కాదు.. సుప్రీంకోర్టులో కీలక విచారణ!
- మొబైల్ ఫోన్లు, మైకులు పట్టుకున్న వారు జర్నలిస్టులు కాదు..
- జర్నలిస్టులు, రీల్ క్రియేటర్ల మధ్య తేడాపై సుప్రీం విచారణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: మొబైల్ ఫోన్, మైక్ పట్టుకున్న ప్రతీ వారు జర్నలిస్టులు అవుతారా? కాదా? అనే దానిపై సుప్రీంకోర్టు దృష్టిసారించింది. జర్నలిస్టులు, సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ల మధ్య తేడాలు ఏంటనే అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం పరిశీలించనుంది. ఢిల్లీలో అక్టోబర్ 10,11 తేదీల్లో జరిగిన నిరసనల్లో ఏడుగురు జర్నలిస్టుల్ని నిర్బంధించి, వారిపై దాడి చేసి, వార్తల్ని సేకరించకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు ఈ మొత్తం కేసులకు కేంద్రంగా మారాయి. ఈ ఘటనపై ఢిల్లీ జర్నలిస్టుల యూనియన్, కేరళ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్, స్వతంత్ర జర్నలిస్ట్ పరంజోయ్ గుహా ఠాకుర్తా తదితరులు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
జర్నలిస్టులపై దాడి ఆరోపణల్లో వాస్తవాలను పరిశీలించేందుకు మాజీ న్యాయమూర్తి ఆర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహన్లతో కూడిన ధర్మాసనం జర్నలిస్టుల చట్టపరమైన గుర్తింపు, వారికి కల్పించాల్సిన రక్షణపై విచారణ చేపట్టింది.
Also Read
నిరసనలు, భారీ ర్యాలీలు జనసమూహాల మధ్య వార్తలు సేకరించే జర్నలిస్టులకు పోలీసులు, ఇతర అధికారుల నుంచి ఎలాంటి రక్షణ కల్పించాలనే అంశాన్ని కోర్టు పరిశీలిస్తుందని జస్టిస్ జయమాల్య బాగ్చీ పేర్కొన్నారు. వార్తలు సేకరించే సమయంలో జర్నలిస్టులను అనవసరంగా నిర్బంధించడం, దాడి చేయడం, రిపోర్టింగ్‌కు ఆటంకం కలిగించకూడదనే అంశంపై కోర్టు దృష్టిసారించింది. జర్నలిస్టులకు ప్రత్యేక రక్షణ కల్పిండచం అంటే చట్టం నుంచి మినహాయించినట్లు కాదని, వారు కూడా పోలీసులు చట్టబద్ధమైన ఆదేశాలు పాటించాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) లేదా ప్రభుత్వం గుర్తింపు పొందిన జర్నలిస్టులు, రిజిస్టర్డ్ మీడియా సంస్థల్లో పనిచేసే రిపోర్టర్లు, స్వతంత్ర లేదా ఫ్రీలాన్స్ జర్నలిస్టులులు ఒక వైపు, మరోవైపు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, రీల్ క్రియేటర్లు కూడా ఉన్నారు. వీరిద్దరికి ఒకే తరహా భద్రతా నిబంధనల్ని వర్తించాలా? లేక వృత్తిపరమైన జర్నలిస్టులకే ప్రత్యేక రక్షణలు కల్పించాలా? అనేది ఇప్పుడు కీలకంగా మారింది.
మరోవైపు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, రీల్ క్రియేటర్లను జర్నలిస్టుల నుంచి వేరుగా గుర్తించాలని ఢిల్లీ పోలీసులు సుప్రీంకోర్టులో వాదించారు. ప్రస్తుతం ప్రతీ ఒకర్కి చేతిలో మొబైల్, మైక్రోఫోన్లు ఉంటున్నాయని, దీంతో నిజమైన జర్నలిస్టులు, నిరసనల్లో పాల్గొంటున్న వారి మధ్య తేడాలు గుర్తించడం కష్టంగా మారిందని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. భద్రతా ప్రోటోకాల్స్ వృత్తిపరమైన జర్నలిస్టులకు మాత్రమే వర్తించాలని పోలీసులు అభిప్రాయపడ్డారు. అరెస్టయిన తర్వాత ఎవరైనా తాము జర్నలిస్టులమని చెప్పుకుంటే, వారికి ఈ ప్రత్యేక ప్రోటోకాల్స్ వర్తింపజేయకూడదని వాదించారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day 13 LIVE: కమనీయం.. రమణీయం.. శ్రీ సీతారాముల కల్యాణోత్సవం..!
-
Supreme Court: మొబైల్ ఫోన్, మైక్ పట్టుకున్న ప్రతీ ఒక్కరూ జర్నలిస్ట్ కాదు.. సుప్రీంకోర్టులో కీలక విచారణ!
-
JC Prabhakar Reddy: నాకు రాజకీయ ప్రతిష్ఠ ముఖ్యం కాదు.. పల్లెల్లో మార్పే నా లక్ష్యం..
-
Post Office MIS Scheme: ఒక్కసారి రూ.5 డిపాజిట్ చేస్తే.. నెలానెలా జీతం లాంటి ఆదాయం!
-
Wheat Flour Soup Recipe: చలికాలానికి బెస్ట్ డిన్నర్.. రొట్టెలకు బదులుగా హెల్తీ ఫుడ్.. 10 నిమిషాల్లో రెడీ!
ట్రెండింగ్
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్‌పై ఎంత పెరిగిందంటే?
-
Sheetal Devi: పతకాల వేటలో అదరగొట్టిన ఆర్చర్‌కు బంపర్ గిఫ్ట్.. Bayon SUV అందించిన హ్యుందాయ్..!
-
Apple Kukatpally: హైదరాబాద్‌లో తొలి అధికారిక Apple స్టోర్.. డిసెంబర్ 10న ప్రారంభం..!