చట్టసభల్లో సభ్యుల ప్రవర్తనపై సుప్రీం ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజా సమస్యలపై చర్చించి వాటికి పరిష్కారం చూపడం, కొత్త చట్టాలను ఆమోదించడం లాంటి కీలకమైన పనులు చేయాల్సిన చట్టసభల్లో ఆరోపణలు, విమర్శలు, ప్రశ్నలు.. తిట్లు.. ఇలా ఎన్నో చూస్తుంటాం… ప్రజాప్రతినిధులు వాడే భాష కొన్నిసార్లు వినడానికే ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి.. ఇక, నిరసనలు, ఆందోళనలు సరేసరి.. కొన్నిసార్లు అవి శృతిమించి స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడం.. పేపర్లు విసురుకోవడం.. మైకులు విసరడం.. ఇలా ఎన్నో ఘటనలు చూశాం.. కానీ, పార్లమెంట్ సహా రాష్ట్రాల అసెంబ్లీల్లో శాసనసభ్యుల ‘అనుచిత ప్రవర్తన’పై ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు.. సభలో మైకులు విసరడం, ప్రజా ఆస్తులను ధ్వంసం చేయడం వంటి పనుల ద్వారా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించింది. ఇది క్షమార్హం కాదని పేర్కొన్న సుప్రీం.. సభ్యుల వికృత ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. 2015లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేరళ అసెంబ్లీలో జరిగిన ఘర్షణకు సంబంధించి దాఖలైన క్రిమినల్ కేసుపై వాదనలు విన్న ధర్మాసనం.. సభ మర్యాదను తప్పక కాపాడాలని వ్యాఖ్యానించింది. ఈ సభలను ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వేదికలుగా అభివర్ణించింది.
అయితే, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక మంత్రికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారని ఓ న్యాయవాది వాదించారు.. ఆయన వ్యాఖ్యలతో విభేదించిన ధర్మాసనం.. ఆ సమయంలో నిరసన కన్నా.. ఆర్థిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టడమే అత్యంత ఆవశ్యకమని పేర్కొంది. కాగా, 2015 మార్చి 13న కేరళ అసెంబ్లీలో రసాభాస జరిగింది. విపక్ష ఎల్డీఎఫ్ సభ్యులు.. అప్పటి ఆర్థిక మంత్రి కేఎం మణి ప్రవేశపెట్టే బడ్జెట్‌ను అడ్డుకున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన.. బడ్జెట్ ప్రవేశపెట్టకూడదని డిమాండ్ చేశారు. స్పీకర్ ఛైర్‌ను పోడియం నుంచి విసిరేశారు. ప్రిసైడింగ్ అధికారి కూర్చునే చోట ఉండే కంప్యూటర్లు, కీబోర్డులు, మైకులను ధ్వంసం చేశారు. దీనిపై పలువురు ఎల్డీఎఫ్ ఎమ్మెల్యేలపై కేసు నమోదైంది. మరి సుప్రీంకోర్టు వ్యాఖ్యలతోనైనా మన నేతల ప్రవర్తనలో మార్పు వస్తుందేమో చూడాలి.
Also Read
- Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
- Niti Aayog: నీతి ఆయోగ్ కొత్త సీఈవోగా అనురాగ్ జైన్ నియామకం.. కేంద్రం ఉత్తర్వులు
- Uday Krishna Reddy: అనాథగా పెరిగి ఐపీఎస్ దాకా.. ముఖ్యమంత్రిచే ప్రశంసలు.. ఉదయ్ కృష్ణారెడ్డి బ్యాగ్రౌండ్ తెలిస్తే కన్నీళ్లు ఆగవు!
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!