Supreme Court: రోడ్లపై వీధి కుక్కలు కనిపిస్తే అంతే! సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. పాత ఆర్డర్ మారేదే లేదని స్పష్టం
- కీలక తీర్పును వెలువరించిన సుప్రీంకోర్టు
- పాత ఉత్తర్వులే అమలులో ఉంటాయని తేల్చి చెప్పిన ధర్మాసనం
- యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ దాఖలు చేసిన అన్ని దరఖాస్తులను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న వీధి కుక్కల దాడి కేసులపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. రోడ్లపై తిరిగే వీధి కుక్కలను తొలగించాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాలను మార్చే ప్రసక్తే లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ వివాదానికి సంబంధించి దాఖలైన వివిధ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం.. గత 2025 నాటి పాత ఉత్తర్వులే అమలులో ఉంటాయని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ దాఖలు చేసిన అన్ని దరఖాస్తులను కోర్టు కొట్టివేసింది.
“ఇది ప్రజారోగ్యం – ప్రజల భద్రతకు సంబంధించిన అత్యంత తీవ్రమైన అంశం. దేశంలో వీధి కుక్కల దాడులు, రేబీస్ వ్యాధి కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతుండటం తీవ్ర ఆందోళనకరం. అన్ని రాష్ట్రాలు కచ్చితంగా యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) నిబంధనలను పాటించాలి” అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Also Read
- Ram Temple donation theft: అయోధ్య విరాళాల చోరీ కేసు.. రేపు సిట్ ఫైనల్ రిపోర్ట్.?
- IMD Alert: దక్షిణాదిలో వడగాలులు.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
- Acid Attack Victims: యాసిడ్ దాడి బాధితులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం..
- Shraddha Walkar case: శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనం.. అఫ్తాబ్ ‘సైకో’గా తేల్చిన ఫోరెన్సిక్ పరీక్షలు..
గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన ఆదేశాలు ఇవే..
గతేడాది (2025) ఆగస్టులో జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్ లతో కూడిన బెంచ్ ఢిల్లీ – ఎన్సీఆర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రోడ్లపై తిరిగే వీధి కుక్కలను పట్టుకుని షెల్టర్ హోమ్‌లకు తరలించాలని, వాటికి నసర్గీకరణ, టీకాలు వేసిన తర్వాత మళ్లీ రోడ్లపైకి వదలకూడదని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియను అడ్డుకునే వారిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
అనంతరం నవంబర్ 2025లో సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలు, నేషనల్ హైవే అథారిటీలను ఆదేశిస్తూ.. పాఠశాలలు, కాలేజీలు, ఆసుపత్రులు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఆట స్థలాల వంటి పబ్లిక్ ఏరియాల నుంచి వీధి కుక్కలను పూర్తిగా తొలగించాలని చెప్పింది. విద్యా, ఆరోగ్య సంస్థల చుట్టూ కుక్కలు లోపలికి రాకుండా ప్రహరీ గోడలు నిర్మించాలని, పట్టుకున్న కుక్కలను మళ్లీ అక్కడ వదలకూడదని స్పష్టం చేసింది. అమాయక పిల్లలపై జరుగుతున్న దాడులు, రేబీస్ కేసులను చూసి ఈ కేసును కోర్టు సుమోటోగా స్వీకరించింది.
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన సుప్రీంకోర్టు తీర్పు
ఈ వివాదానికి సంబంధించి అన్ని పక్షాల సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత, జనవరి 29న సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోవడంతో.. ప్రజల రక్షణ కోసం కఠినమైన గైడ్‌లైన్స్ రూపొందించాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసు విషయంలో పెద్ద చర్చే నడిచింది. ఒకవైపు సాధారణ ప్రజల భద్రత, మున్సిపల్ కార్పొరేషన్ల బాధ్యతలపై వాదనలు జరగ్గా.. మరోవైపు జంతు హక్కుల కార్యకర్తలు మూగజీవాలపై క్రూరత్వం చూపించకూడదని, కేవలం నిబంధనల ప్రకారం నసర్గీకరణ మాత్రమే చేయాలని వాదించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఇచ్చిన తాజా తీర్పు.. భవిష్యత్తులో వీధి కుక్కల సమస్యను అరికట్టడానికి ఒక స్పష్టమైన మార్గాన్ని చూపిస్తుండటంతో దేశవ్యాప్తంగా దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Chiru – Bobby : చిరంజీవి – బాబీ సినిమా మాస్ సాంగ్’కి పూనకాలే!
-
Pakistani Cinema: నెట్‌ఫ్లిక్స్‌తో భాగస్వామ్యానికి పాకిస్తాన్ ప్రయత్నాలు.. గ్లోబల్ స్ట్రీమింగ్పై ఫోకస్
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
-
HMDA చీఫ్ ఇంజనీర్ పై ACB ఉక్కుపాదం.. 20 గంటల సోదాలు.. రూ.100 కోట్ల ఆస్తుల గుర్తింపు.!
ట్రెండింగ్
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!
-
7 అంగుళాల OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, AI యాంటీ-ఫ్రాడ్ ఫీచర్లతో REDMI Note 17 లాంచ్..!
-
Shubman Gill: ఆ ఇద్దరి వల్లే గెలిచాం.. లేదంటే మరో ఓటమే.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!