2017 ఉన్నావ్ అత్యాచారం కేసులో నిందితుడు కుల్దీప్సింగ్ సెంగార్‌కు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. కుల్దీప్ సెంగార్ జీవిత ఖైదును నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల వెకేషన్ బెంచ్ సోమవారం విచారించింది. విచారణ జరిపిన న్యాయస్థానం ఢిల్లీ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది. ఇక కుల్దీప్ సింగ్ సెంగార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో రిప్లై ఇవ్వాలని ఆదేశించింది.
ఇది కూడా చదవండి: 2025 National Rewind: ఈ ఏడాది జాతీయంగా చరిత్ర సృష్టించిన నారీమణులు వీరే!
ఇక ఈరోజు విచారణకు ముందు బాధితురాలు మాట్లాడుతూ.. సుప్రీంకోర్టుపై తనకు నమ్మకం ఉందని తెలిపింది. తన కుటుంబానికి, తనకు భద్రత కల్పించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు బాధితురాలు విజ్ఞప్తి చేసింది. దర్యాప్తు అధికారి, ఓ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తితో సహా అధికారులకు నిందితుడు సెంగర్ లంచం ఇచ్చాడని ఆరోపించింది. సెంగర్‌కు బెయిల్ వచ్చినప్పటి నుంచి తన కుటుంబం భయంతో బతుకుతుందని పేర్కొంది.
ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు గుడ్‌న్యూస్.. తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్స్
#WATCH | Supreme Court stays the order of Delhi HC, which suspended the life sentence of expelled BJP leader Kuldeep Singh Sengar in the 2017 Unnao rape case of a minor girl.
Mother of the victim says, "We are very happy. We want to thank the Supreme Court. My daughter should… pic.twitter.com/B6GDjkrP4C
— ANI (@ANI) December 29, 2025