Supreme Court: ఇంటి పనుల్లో భార్యతో పాటు సమానంగా చేయాల్సిందే.. ఓ భర్తకు సుప్రీం కోర్టు క్లాస్
- ఇంటి పనుల్లో భార్యతో పాటు సమానంగా చేయాల్సిందే
- ప్రస్తుతం కాలం మారింది
- ఓ భర్తకు సుప్రీం కోర్టు క్లాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు ఆడవాళ్లంటే ఇంటికే పరిమితం అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది. అన్నింటిలో సగ భాగం అంటూ మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్లిపోతున్నారు. ఇలాంటి తరుణంలో ఉద్యోగం.. ఇంటి పనులు అన్ని మహిళలపైనే మోపితే కుదరదు. తాజాగా ఇలాంటి కేసులో దేశ సర్వోన్నత న్యాయస్థానం ఓ భర్తకు క్లాస్ పీకింది.
ఇంట్లో పనుల విషయంలో భార్య క్రూరంగా ప్రవర్తిస్తోందని ఆరోపిస్తూ ఓ భర్త విడాకులు కోరగా కింది కోర్టు మంజూరు చేసింది. అనంతరం కర్ణాటక హైకోర్టు.. కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేసింది. అటు తర్వాత హైకోర్టు ఉత్తర్వును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్‌గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
తాజాగా పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ఇరుపక్షాల మధ్య మధ్యవర్తిత్వం విఫలమైందని తెలిపాడు. భార్యాభర్తలిద్దరూ ఉపాధ్యాయులు అని.. వీరికి 2017లో వివాహం జరిగిందని.. 2019 నుంచి విడిగా నివసిస్తున్నారని తెలిపాడు. భార్య క్రూరత్వం కారణంగా బాధితుడు కింది కోర్టులో విడాకులు కోరగా.. మంజూరు చేసిందని.. అనంతరం కర్ణాటక హైకోర్టు రద్దు చేయడంతో తిరిగి సుప్రంకోర్టుకు వచ్చినట్లు పేర్కొన్నాడు. తన క్లయింట్ విడాకులు కోరుకుంటున్నాడని తెలియజేశాడు. దీంతో సుప్రీం ధర్మాసనం.. భార్య క్రూరత్వం ఏమిటి? అని ప్రశ్నించింది. దీంతో ఇంటిలో పనులు చేయకుండా.. వంట చేయకుండా ఇబ్బంది పెడుతోందని పిటిషనర్ తరపు న్యాయవాది పేర్కొన్నాడు.
దీంతో జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌కు ఓ రేంజ్లో క్లాస్ పీకింది. ‘‘వంట చేయడం, శుభ్రపరచడం, బట్టలు ఉతకడం భార్య ఒక్కదానికి సంబంధించింది కాదని.. ప్రస్తుతం కాలం మారిందని.. అన్ని పనుల్లో భార్యతో పాటు భర్తలు కూడా పాలుపంచుకోవాల్సిందే. అయినా మీరు ఒక పని మనిషిని పెళ్లి చేసుకోలేదు. ఒక జీవిత భాగస్వామిని పెళ్లి చేసుకున్నారు. భార్య అనుచితంగా ప్రవర్తించిందని.. వంట చేయలేదని విడాకులు కోరడమేంటి?’’ అని పిటిషనర్‌ను సుప్రీం కోర్టు తీవ్రంగా మందలించింది.
‘‘భార్యాభర్తలు అన్నాక అన్ని పనుల్లో భర్తలు సహాయం చేయాలి. వంట, బట్టలు ఉతకడం ఇలా అన్ని పనుల్లో భర్త సహకరించాలి. వివాహం అనేది జీవిత భాగస్వాముల కోసం కాబట్టి ఇంటి పనుల్లో భర్త తన భార్యకు సమానంగా సహాయం చేయాల్సిందే. వంట చేయడానికి లేదా ఇంటి పనులు చేయడానికి భార్య నిరాకరించడాన్ని మానసిక క్రూరత్వానికి కారణంగా పరిగణించలేం.’’ అని సుప్రీం కోర్టు పేర్కొంది. తదుపరి విచారణకు ప్రభుత్వ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులిద్దరూ రావాలని న్యాయస్థానం పేర్కొంది. దీంతో తదుపరి విచారణ ఏప్రిల్ 27కు వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “వాటిని నేను తలకెక్కించుకోను.. నా టార్గెట్ అదే”.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Astrology: మే 20 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!