Rahul Gandhi: భారత్ జోడో యాత్ర సమయంలో ఇండియన్ ఆర్మీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు నిన్న (ఆగస్టు 4న) మందలించింది. రాహుల్‌పై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు నిరాధారణమైనవని, అతడు మాట్లాడిన మాటలు సరైనవేనంటూ ఇండియా కూటమిలోని పలు పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. జాతీయ అంశాలను ప్రశ్నించే బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంటుందని వెల్లడించారు. ఈ అంశంపై కూటమిలోని పలు పార్టీలకు చెందిన సభాపక్ష నేతలు సమావేశమై చర్చలు జరిపారు. అలాగే, రాజకీయ పార్టీల ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధంగా కోర్టు అసాధారణమైన వ్యాఖ్యలు చేయడం పద్దతి కాదు అన్నారు. దీన్ని అన్ని పార్టీల నేతలూ అంగీకరించారని కాంగ్రెస్ ఓ ప్రకటనలో వెల్లడించింది. రాజకీయ పార్టీలకు.. మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నేతలకు జాతీయ సమస్యలపై ప్రశ్నించే బాధ్యత ఉంటుందని చెప్పుకొచ్చింది.
Read Also: Raksha Bandhan 2025: ప్రధాని మోడీ కోసం రాఖీ సిద్ధం చేసిన పాక్ ముస్లిం సోదరి ఖమర్ మొహ్సిన్ షేక్..
ఇక, పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో వయనాడ్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ భారత భద్రతా దళాలను ఎంతో గౌరవిస్తారు, ప్రతిపక్ష నాయకుడిగా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు అతడికి ఉందన్నారు. నిజమైన భారతీయుడు ఎవరు అనేది వాళ్లు నిర్ణయించలేరు. సర్కార్ కి ప్రశ్నలు సంధించడం ప్రతిపక్ష నేతగా రాహుల్ బాధ్యత అని చెప్పుకొచ్చారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ ఇండియన్ ఆర్మీకి వ్యతిరేకంగా మాట్లాడరు, భద్రతా దళాలను చాలా గౌరవిస్తారని ప్రియాంక గాంధీ వెల్లడించింది.
