Supreme Court: అది ప్రేమ, కామం కాదు.. “పోక్సో కేసు”లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- పోక్సో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- ఆర్టికల్ 142ను ఉపయోగించి కేసును రద్దు చేసిన కోర్టు..
- మైనర్‌తో లైంగిక సంబంధం పెట్టుకున్న వ్యక్తికి ఊరట..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: పోక్సో(POCSO) కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142ను ఉపయోగించింది. ఒక అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పుడు ఆమెతో లైంగిక సంబంధం పెట్టుకుని, ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకునన వ్యక్తిపై పోక్సో చట్టం కింద కేసుల్ని రద్దు చేసింది. ఈ చర్య ఇద్దరి మధ్య కామంతో జరగలేదని ప్రేమ వల్ల జరిగిందని కోర్టు పేర్కొంది. ప్రస్తుతం, ఆ వ్యక్తి భార్య అయిన మహిళతో సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని గడుపుతున్నట్లు కోర్టు గుర్తించింది. ఈ దంపతులకు ఏడాది వయసు ఉన్న కుమారుడు కూడా ఉన్నాడు. మహిళ తండ్రి కూడా ఆమె భర్తపై నేరారోపణల్ని ముగించడానికి సిద్ధంగా ఉన్నట్లు జస్టిస్ దీపాంకర్ దత్తా, ఎజీ మసిహ్‌తో కూడిన ధర్మాసనం గుర్తించింది.
Read Also: Paddy Procurement : రైతులకు శుభవార్త.. నవంబర్ 3 నుంచి ధాన్యం కొనుగోళ్లు
Also Read
- Karnataka Tragedy: కర్ణాటకలో ఘోర విషాదం.. ముత్యపుచిప్పల కోసం మృత్యు ఒడిలోకి! నదిలో మునిగి ఎనిమిది మంది మృతి..
- Viral: ఫుడ్ పాయిజనింగ్‌కు రూ. 65 వేల బిల్లు.. నెట్టింట వైరల్‌గా మారిన ఆ హాస్పిటల్ దోపిడీ..
- Falta Re-polling Result: అభిషేక్ బెనర్జీ అడ్డాలోనే టీఎంసీ ఖల్లాస్.. ఫల్తా రీపోలింగ్‌లో బీజేపీ క్లీన్ స్వీప్!
- Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్..
‘‘నేరం అనేది ఒక వ్యక్తిపై మాత్రమే కాకుండా, మొత్తం సమాజంపై జరిగే తప్పు అనే వాస్తవాన్ని మేము గ్రహించాం. అయితే, చట్టం అమలు చేసేటప్పుడు వాస్తవ పరిస్థితులను పక్కన పెట్టకూడదు’’ అని కోర్టు చెప్పింది. ‘‘న్యాయం అందించడానికి సూక్ష్మనైపుణ్య విధానాన్ని కోరుతుంది. సాధ్యమైన చోట వివాదాన్ని ముగించడం సమాజానికి కూడా మంచిది’’ అని కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ‘‘చట్ట సభలు చేసిన చట్టాల ప్రకారం, వ్యక్తి దారుణమైన నేరానికి దోషిగా నిర్ధారించబడినందున, రాజీ ఆధారంగా విచారణ రద్దు చేయలేము. కానీ అతడి భార్య కరుణ, సానుభూతి కోసం చేసే విజ్ఞప్తిని విస్మరించడం న్యాయం యొక్క లక్ష్యాలను సాధించదు’’ అని కోర్టు పేర్కొంది. తీవ్రమైన నేరస్తులు కూడా అవసరమైన చోట కరుణకు అర్హులు అని ధర్మాసనం పేర్కొంది.
ఈ కేసులో సంబంధం లైంగిక దోపిడిపై కాకుండా, ప్రేమపై ఆధారపడి ఉందని కోర్టు గుర్తించింది. ఇద్దరు కూడా కుటుంబాన్ని ఏర్పరుచుకున్నారని కోర్టు చెప్పింది. తన భర్తపై నేరస్తుడనే ముద్ర లేకుండా శాంతియుత, స్థిరమైన కుటుంబ జీవితాన్ని గడపాలని బాధితురాలు కోరికను వ్యక్తం చేసిందని, క్రిమినల్ చర్యలు కొనసాగిస్తే అతడిని జైలులో ఉంచితే కుటుంబం దెబ్బతింటుందని, వారి పిల్లలపై ఇది కోలుకోలేని దెబ్బ తీస్తుందని కోర్టు అభిప్రాయపడింది. దీంతో పూర్తి న్యాయం అందించాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ.. శిక్షను రద్దు చేయడానికి ధర్మాసనం ఆర్టికల్ 142 అనే విచక్షణాధికారాన్ని ఉపయోగించింది. అయితే, భార్య, పిల్లలను విడిచిపెట్టవద్దని, జీవితాంతం వారిని గౌరవంగా కాపాడాలని ఆ వ్యక్తిని కోర్టు ఆదేశించింది. భవిష్యత్తులో ఏదైనా ఇబ్బందుల కలుగచేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఈ ఉత్తర్వుల్ని ప్రత్యేక పరిస్థితుల్లో జారీ చేశామని, ఇతర కేసులకు దీనిని ఉదాహరణగా పరిగణించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్‌తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్‌పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!