Site icon NTV Telugu

Ranveer Allahbadia: ర‌ణ్‌వీర్ అల్హాబాదియాకు సుప్రీంకోర్టులో ఊరట.. పాస్‌పోర్టు ఇవ్వాలని ఆదేశాలు..

Supreme Court

Supreme Court

Ranveer Allahbadia: యూట్యూబర్ రణ్ వీర్ అల్హాబాదియాకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. పాస్ పోర్టును అతనకి తిరిగి ఇచ్చేయాలని ఇవాళ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కాగా, అల్హాబాదియాపై నమోదు అయినా కేసుల్లో విచారణ పూర్తి కావడంతో.. ఈ కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. యూట్యూబర్ అల్హాబాదియా.. బీర్ బైసెప్స్ షోతో ఫేమస్ అయ్యాడు. విదేశీ ప్రయాణం ఉండటంతో అతడికి పాస్ పోర్టును అప్పగించాలని పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Read Also: Congress: పహల్గామ్ ఉగ్ర దాడితో కాంగ్రెస్లో విభేదాలు.. పార్టీ లైన్ దాటొద్దన్న ఏఐసీసీ

ఇక, జ‌స్టిస్ ఎన్ కోటేవ్వర్ సింగ్, జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని సుప్రీం ధ‌ర్మాస‌నం ఈ తీర్పును ఇచ్చింది. అస్సాం, మ‌హారాష్ట్ర ప్రభుత్వాలు విచార‌ణ పూర్తి చేసిన‌ట్లు తెలిపాయి. పాస్‌పోర్టు కోసం మ‌హారాష్ట్ర సైబ‌ర్ క్రైం బ్యూరోకు వెళ్లాల‌ని సూచించింది. అల్హాబాదియా త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాది అభిన‌వ్ చంద్రచూడ్ వాదనలు వినిపించారు. అల్హాబాదియాపై నమోదైన కేసులన్నీ ఒక్క చోటకు చేర్చాలన్న అడ్వకేట్ అభినవ్ అభ్యర్థనను న్యాయస్థానం స్వీకరిస్తున్నట్లు చెప్పింది.

Read Also: Virat Kohli: రివెంజ్ దెబ్బ అదుర్స్ కదూ.. కేఎల్ రాహుల్ దగ్గరికి వెళ్లి కోహ్లీ ఇచ్చిపడేశాడుగా!

కాగా, ఓ యూట్యూబ్ ప్రోగ్రాంలో త‌ల్లితండ్రుల శృంగారంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అల్హాబాదియాపై ప‌లు రాష్ట్రాల్లో కేసులు న‌మోదు కాగా.. ఫిబ్రవరి 18వ తేదీన సుప్రీంకోర్టు కీల‌క తీర్పు ఇచ్చింది. అల్హాబాదియాను అరెస్టు చేయ‌వ‌ద్దు అని తెలిపింది. థానే పోలీసు స్టేష‌న్‌లో పాస్‌పోర్టును డిపాజిట్ చేయాల‌ని సూచించింది. ఇక, విలువ‌లు, హుందాత‌నంతో ద ర‌ణ్‌వీర్ షోను న‌డుపుకోవ‌చ్చు అని మార్చి 3న సుప్రీంకోర్టు అతడికి చెప్పింది.

Exit mobile version